రాష్ట్రీయం

బాబు సర్కార్‌కు మూడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నుతున్న కుయుక్తులకు నిరసనగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్టవ్య్రాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన జగన్‌ను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. రెండు గంటల సేపు అక్కడే ధర్నా నిర్వహించిన జగన్, అనంతరం విమానంలో బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ గురువారం రాత్రి విలేఖరులతో మాట్లాడుతూ, చంద్రబాబు, సుజనా చౌదరి హోదాపై మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే, వారు మనుషులేనా అనిపిస్తోందన్నారు. ‘చంద్రబాబు ప్రభుత్వం మరో రెండేళ్లు ఉంటుంది. ఏడాదిలో పోయినా పోతుంది. కొంతమంది పోలీసులు చంద్రబాబు సర్కార్‌కు కొమ్ముకాస్తున్నారు. ఈ ధోరణి మంచిది కాదు. పోలీసులు మూడు సింహాలకు సెల్యూట్ చేయాలి. అంతేకాని గుంటనక్కలకు కాదు. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనలపై మా ప్రభుత్వం రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే దర్యాప్తు జరిపి కారకులపై చర్యలు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు. పోలీసులకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వమే తప్ప చంద్రబాబు కాదని జగన్ అన్నారు. విశాఖలో గురువారం సాయంత్రం జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చ అన్నారు. ఎయిర్ పోర్టులు కేంద్రం పరిధిలోకి వస్తాయని, అక్కడ అనుమతులు లేకుండా రాష్ట్ర పోలీసులు పెత్తనం చేశారన్నారు. విమాన ప్రయాణికులను ఎయిర్ పోర్టులోకి రానివ్వకుండా పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారన్నారు. రాష్ట్రంలో హోదాకోసం విద్యార్ధులు ఉద్యమించాలని, పోలీసుల వేధింపులకు భయపడరాదని, తమ పార్టీ అధికారంలోకి వస్తే కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. హోదాను నీరుకార్చే చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ప్రజలు బంగాళాఖాతంలో కలిపివేస్తారన్నారు. చంద్రబాబు లాంటి నేతలు స్వాతంత్య్ర పోరాట కాలంలో ఉంటే మనకు స్వాతంత్య్రం అక్కర్లేదని చెప్పేందుకు కూడా వెనకాడి ఉండేవారు కాదని ఎద్దేవా చేశారు. జల్లికట్టు ఆట కావచ్చని, కాని ఆ ఆట పరిరక్షణకు తమిళులు ప్రదర్శించిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అన్ని పక్షాలతో కలిసికట్టుగా పోరాడుతామన్నారు.