రాష్ట్రీయం

అభివృద్ధే అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: ‘స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహనీయులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకోవడం మన విధి. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామ’ని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపధ్యంలో అభివృద్ధే ఎజెండాగా దిశా నిర్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ప్రజలకు సంతోషంతో కూడిన సౌభాగ్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దాదాపు 5,980 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంటోందన్నారు. ఇంతవరకూ ప్రతిపాదించి, వివిధ దశల్లో ఉన్న 102 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 15 వేల కోట్లతో 80 పరిశ్రమలకు సంబంధించి ప్రతిపాదనలు ఖరారయ్యాయని వివరించారు. భాగస్వామ్య సదస్సు నిర్వహించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కడం గర్వకారణమన్నారు. ఇంధనం, వౌలిక సదుపాయాల రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ఎపి ఆర్ధికాభివృద్ధి మండలి సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్రం 24.44 శాతం అసాధారణమైన ప్రగతిని తొలి అర్ధవార్షికంలోనే సాధించామన్నారు.
స్థిరమైన అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ కుటుంబ వికాసం, సమాజ వికాసం కోసం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను దీర్ఘకాలిక ప్రణాళికలతో దూరదృష్టితో అమలు చేస్తుందన్నారు. ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి, ప్రపంచ సమాజంతో పోటీపడే అంశాలతో ముందుకు వెళుతున్నామన్నారు. డిజిటల్ కరెన్సీ, చెల్లింపుల విధానంలో నూతన పోకడకు శ్రీకారం చుట్టామన్నారు.
కృష్ణా-గోదావరి నదుల అనుసంధానాన్ని రికార్డు టైమ్‌లో పూర్తిచేయడం ద్వారా 2016 మార్చి నాటికి లిఫ్ట్‌ఇరిగేషన్ ద్వారా నీరు అందించగలిగామన్నారు. తద్వారా 2015-16లో 8టిఎంసిల నీటిని మళ్లించగలిగి, ఖరీఫ్‌లో 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం, భూగర్భ జలాల స్థాయి పెంచడం చేశామన్నారు. తద్వారా 2500 కోట్ల మేర అధిక దిగుబడిని సాధించడంతో పాటు ఖరీఫ్ సీజన్‌లో 56 టిఎంసిల నీటిని మళ్లించడం ద్వారా కృష్ణాడెల్టాలో 10.56 లక్షల ఎకరాల పంటను కాపాడుకున్నామన్నారు.
నాబార్డ్ సహాయంతో కేంద్రం 1981 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు నిధులను అందించడం జరుగుతుందన్నారు. 2019 నాటికి పోలవరం పర్తిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. స్వర్ణముఖి, వంశధార నదుల అనుసంధానం ద్వారా స్మార్ట్ వాటర్ గ్రిడ్‌కు చర్యలు చేపడుతుందన్నారు.
మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించినట్లు అభివృద్ధి ఫలాలు అందరికీ సమంగా అందేలా కృషి చేద్దాం. ఇందుకోసం అందరం చేయి చేయి కలిపి పరస్పర సహకారంతో సమష్టిగా కృషి చేద్దాం. మాది, మనది అనే భావనతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేద్దామన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు అనుక్షణం శ్రమిద్దాం. ఈ లక్ష్యసాధనలో యువతరం ముందుకు రావాలని, ఉత్సాహంగా, స్వచ్ఛందంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతూ గవర్నర్ శుభాభినందనలు తెలిపారు.

చిత్రాలు..గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో గురువారం జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్ నరసింహన్