రాష్ట్రీయం

ఒకే కాన్పులో నలుగురు శిశువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొల్లాపల్లి, జనవరి 5: ఓ మహిళకు మొదటి కాన్పులో నలుగురు శిశువులు జన్మనిచ్చిన సంఘటన గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలోని నెహ్రునగర్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన సుజాత బాయి కాన్పు కోసం వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరగా తొలి కాన్పులోనే నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు. తల్లి, శిశువులు క్షేమంగా ఉన్నారని, మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించినట్లు వైద్యులు మంగళవారం తెలిపారు.
మావోయస్టుల ఢంప్ స్వాధీనం
చింతూరు, జనవరి 5: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబాద్ జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్‌ను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలావున్నాయి. గరియాబాద్ జిల్లా కార్లజార్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్ ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ట్ ఫోర్స్ బలగాలు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేపట్టాయి. ఈక్రమంలో మావోయిస్టులకు సంబంధించి 24 టిఫిన్ బాక్స్ బాంబులు, 28 పెట్రోలు బాంబులు పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఇలావుండగా బీజాపూర్ జిల్లా బాసాగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని టర్రెం గ్రామ సమీపంలో కూంబింగ్ చేపడుతున్న సిఆర్‌పిఎఫ్ బలగాలు లక్ష్యంగా మావోయిస్టులు పైపు బాంబు పేల్చారు.
టిడిపి సానుభూతిపరుడి దారుణహత్య
బనగానపల్లె, జనవరి 5: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం రామకృష్ణాపురం గ్రామంలో టిడిపి సానుభూతిపరుడు కురువ నాగేశ్వరరావు(38)ను ప్రత్యర్థులు మంగళవారం వేటకొడవళ్లతో నరికి చంపారు. నాగేశ్వరరావు మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పిల్లలిద్దరినీ పాఠశాలలో వదిలి వెళ్తుండగా గ్రామానికి చెందిన ప్రత్యర్థి వర్గీయులు నాగేశ్వరరావుకళ్లలో కారంచల్లి వేటకొడవళ్లతో నరికి చంపారు. గత ఏడాది జరిగిన పలుకూరు మాజీ సర్పంచ్ ఆపతి ప్రభాకర్‌నాయుడు హత్యకేసులో నాగేశ్వరరావు మొదటి ముద్దాయి. దానికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
గుట్కాపై ఏడాది పాటు నిషేధం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 5: గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు సంబంధించిన ఉత్పత్తుల తయారీని ఏపి ప్రభుత్వం నిషేధించింది. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం పొగాకు ఉత్పత్తులు, నిల్వలు, పంపిణీ, సరఫరాలు వంటి వాటిపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 10వ తేదీ నుంచి 2017, జనవరి 9వ తేదీ వరకు సంవత్సరం పాటు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే చట్టరిత్యా శిక్షార్హులని స్పష్టం చేస్తూ ఆహార పరిరక్షణ విభాగం కమిషనర్ కెవి సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
‘అన్న సంజీవని’లో మందుల పంపిణీ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 5: అన్న సంజీవనీ కార్యక్రమంలో భాగంగా మందులను పంపిణీ చేయాలని ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 8వేలమంది అధికారులతో చంద్రబాబు మంగళవారం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జన్మభూమి - మా ఊరుపై ఆయన అధికారులను దిశానిర్దేశం చేశారు. జన్మభూమి - మా ఊరు పర్యటన అనుభవాలను చంద్రబాబు వివరించారు. పంట సంజీవనీ పథకం కింద ఫామ్‌పాండ్స్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు, 20 రాజీలేని అభివృద్ధి సూచికల అమలు గురించి చంద్రబాబుకు కలెక్టర్లు వివరించారు. గ్యాస్ కనెక్షన్ ఉందా, లేదా అనే విషయం మహిళలను, స్కూల్‌కి వెళుతున్నారో లేదో పిల్లల్ని అడిగి తెలుసుకోవాలని సిఎం కోరారు.
సిఎంకు ‘స్వామినారాయణ్ అక్షరధామ్’ ఆహ్వానం
దేశ రాజధాని కొత్త ఢిల్లీలో సుప్రసిద్ధ ఆధ్యాత్మిక ధామం ‘స్వామినారాయణ్ అక్షర్ థామ్’ను సందర్శించాలని మందిర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానించారు. గుజరాత్ రాష్ట్ర నవ్‌సారి ‘స్వామినారాయణ్ అక్షరధామ్’కు చెందిన పురుషోత్తమస్వామి ఆధ్వర్యంలో స్వామీజీలు మంగళవారం విజయవాడలోని ఏపి ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. గత దశాబ్దకాలంలో 193 దేశాలకు చెందిన 6కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని, సందర్శించుకున్న ప్రముఖుల్లో 92 దేశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన మంత్రులు ఉన్నారని వివరించారు. ప్రాక్, పశ్చిమాలకు వారధిగా, విజ్ఞాన శాస్త్రం, ఆధ్యాత్మిక తత్వాన్ని అనుసంధానిస్తూ నిర్మించిన ఢిల్లీలోని ‘స్వామినారాయణ్ అక్షరధామ్’ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిందని వారన్నారు.

ఫ్లెమింగో పండుగకు అక్షర రూపం!
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు,జనవరి 5 : నెల్లూరు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన పులికాట్ సరస్సుకు వచ్చే విదేశీ విహంగాలను తిలకించే వారికోసం ఏర్పాటుచేసిన పక్షుల పండగకు కొంతమంది కవులు అక్షరరూపం ఇచ్చారు. ప్రతి ఏటా జనవరి 9,10 తేదీల్లో ప్రభుత్వ తరఫున నిర్వహించే పక్షుల పండగ నిర్వహణలో భాగంగా నెల్లూరు విఆర్ కాలేజీ ఆవరణలో పక్షుల పండగపై దక్షిణాది రాష్ట్రాల కవి సమ్మేళనం జరిగింది. జెసి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కవి సమ్మేళనంలో ప్రకృతి... పక్షుల కిలకిలారావాలు, ..పక్షులు హొయలు తదితర అంశాలను స్పృశిస్తూ ప్రకృతిలో అందాలను ఒలకబోస్తూ, సంచరించటం తదితర విహంగాలను కవులు తమ రచనలతో కవిత్వ రూపంలో వినిపించడం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తెలుగు,హిందీ,కన్నడ,మళయాళం తదితర దక్షణాది ప్రాంతాలకు చెందిన కవులు పాల్గొని తమ కవిత్వాన్ని వినిపించారు. ముగింపులో విక్రమసంహపురి యూనివర్శిటి వైస్ చాన్సలర్ వి.వీరయ్య మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాన్ని కవితల రూపంలో తెలియజేయడం అభినందించదగ్గ విషయమన్నారు.

అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
గుంతకల్లు, జనవరి 5: అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉన్నట్లు బెదిరింపు ఫోన్‌కాల్ రావడంతో మంగళవారం అప్రమత్తమైన ఆర్పీఎఫ్, జిఆర్‌పి, పట్టణ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. హుబ్లీ నుండి విజయవాడకు బయలుదేరిన రైలులో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. అప్పటికే హుబ్లీ నుండి రైలు బయలుదేరడంతో గుంతకల్లు ఆర్పీఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో అరగంట వ్యవధిలో 17225 హుబ్లీ- విజయవాడ, 17228 విజయవాడ, హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గుంతకల్లు స్టేషన్‌కు చేరుకోగానే అర్బన్ సిఐ ప్రసాద్‌రావు, ఆర్పీఎఫ్ ఐపిఎఫ్ ప్రసాద్ ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది. అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్టు హుబ్లీ నుండి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయానికి ఫోన్‌కాల్ రాగా వెంటనే స్పందించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం వారు గుంతకల్లు రైల్వే డివిజన్ కమాండెంట్ కార్యాలయానికి సమాచారం అందించారు.

భారీగా ఎర్రచందనం స్వాధీనం
కలువాయి/రేణిగుంట, జనవరి 5: చెన్నై నగరానికి చెందిన బడా ఎర్ర చందనం స్మగ్లర్ కలీజ్ రెహమాన్ (్భయ్)ని మంగళవారం నెల్లూరు జిల్లా కలువాయి పోలీసులు తమిళనాడులోని గుమ్మడిపుడి దగ్గర అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అత్మకూరు డి ఎస్‌పి సుబ్బారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతు గత నెల 25,31 తేదిలలో కలువాయి , ఇతర ప్రాంతాలకు చెందిన 14 మందిని కలువాయి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా తమిళనాడుకు చెందిన కలీస్ అనే వ్యక్తికి విక్రయించినట్లు వచ్చిన సమాచారం మేరకు కలువాయి ఎస్సై కొండపనాయుడు పొదలకూరు సి ఐ శ్రీనివాసురావు సహకారంతో కలువాయి సిబ్బంది,కృష్ణపట్నంపోర్టు ఎస్సై విశ్వనాధ్, తడ ఎస్సై సురేష్ బాబు సహకారంతో సోమవారం నుండి కాపుకాచి కలీస్ రెహమాన్ ను అరెస్ట్ చేశారన్నారు. కలీస్ ఎర్ర చందనాన్ని వివిధ రకాల మిషన్ల ద్వార అనేక రకాల బొమ్మలు, గోలీలు, రుద్రాక్షుల రూపంగా మలచి అధికారుకు అననుమానం లేకుండా విదేశాలకు విక్రయించి కోట్ల రూపాయలు గడించారన్నారు. సమారు ఎకరా స్థలంలో మిషన్లు ఎర్పాటు చేసుకుని స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు. కలీస్ దగ్గర నుండి 18 మిషన్లు, 70 ఎర్ర చందనం దుంగలు ,1100 కేజీల వివిధ రకాలో తయారు చేసిన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. స్కోడా కారు, క్వాలీస్, నాలుగు చక్రాల ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. రేణిగుంట మండలం కరకంబాడి అటవీ ప్రాంతంలో మంగళం రోడ్డులో 25 లక్షల రూపాయలు విలువ చేసే 21 ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

తీర గస్తీకి మరో అత్యాధునిక నౌక
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 5: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన హోవర్‌క్రాఫ్ట్ హెచ్-193 నిఘా నౌక ఆంధ్ర తీర పరిరక్షణ కోసం విశాఖకు చేరుకుంది. ఇప్పటి వరకూ హాల్దియా కేంద్రంగా ఉన్న ఈ నౌక ఆంధ్రప్రదేశ్ తీరంలో నిఘా కోసం ప్రత్యేకించి ఇక్కడికి చేరుకుంది. ఎఎన్ 8000 టిడి సిరీస్‌కు చెందిన నౌకను ఇండియన్ కోస్ట్‌గార్డ్ కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని గ్రిఫాన్ హోవర్‌వర్క్స్ లిమిటెడ్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించింది. 21 మీటర్ల పొడవున్న ఈ నౌక సుమారు 31 టన్నుల బరువు ఉంటుంది. గంటకు 50 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది.