రాష్ట్రీయం

పురపాలక సంఘాల్లో డ్వాక్రాలకు మంగళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 5: మగవారికి దీటుగా మహిళలను కుటుంబ పోషణలో భాగస్వాముల్ని చేయటమే గాక పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్న మాటలకు, చేతలకు ఎంతో వ్యత్యాసం కన్పిస్తోంది. ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఇసుక అమ్మకాల బాధ్యతను డ్వాక్రా మహిళలకు అప్పగించిన ముఖ్యమంత్రి తీరా వారిని జనవరి 30వ తేదీ రాత్రికి ఉద్వాసన చెప్పి బడా కాంట్రాక్టర్లకు ఇసుక క్వారీలను అప్పగించబోతున్నారు. తాజాగా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న మహిళలను ఆ పనుల నుంచి తప్పించేందుకు డ్వాక్రా పొదుపు సంఘాలు, సొసైటీలను రద్దు చేస్తూ ప్రభుత్వం 279 జీవో జారీ చేసింది. మార్చిలో టెండర్లు పిలిచి ఏప్రిల్ 1 నుంచి డ్రెయిన్లు, ఇతర పారిశుద్ధ్య పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. అయితే వచ్చే కాంట్రాక్టర్లు ఎంతమందికి మళ్లీ అవకాశం కల్పిస్తారో అయోమయ స్థితి. ఒక్క విజయవాడ నగరంలోనే వివిధ డ్వాక్రా సంఘాలు, సొసైటీల పరిధిలో 3600 మంది మహిళలు, పురుషులు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మందికి పైగానే 15 ఏళ్లుగా కాంట్రాక్టర్లతో ప్రమేయం లేకుండా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. పోరాటాల ఫలితంగా ప్రభుత్వం వీరికి నెలకు 11 వేల రూపాయల వేతనాన్ని ప్రకటించడంతో అధికారపక్షం తెలుగుదేశం కన్ను పడనే పడింది. వీరందరినీ తొలగించి తెలుగుదేశం సానుభూతిపరులుగా ఉన్న వారిని పారిశుద్ధ్య పనుల్లో నియమించుకునేందుకు కుట్ర పన్నారు. దీని ఫలితంగానే తాజాగా 279 జీవో విడుదలైంది. ఈ జీవో జారీతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల్లో భయాందోళన చోటుచేసుకుంది. రానున్న కాంట్రాక్టర్లు ఆదాయమే పరమావధిగా సంఖ్యను తగ్గించవచ్చనేది ఒక విమర్శ కాగా, ఎంతమేర చెల్లిస్తారో అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. అన్నింటిని మించి తమను తొలగించి కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తారన్న మరో భయం వెంటాడుతోంది.