రాష్ట్రీయం

మొక్కుబడిగా చేస్త్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 5: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల వద్దకే అధికారులు వెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, అయితే కడపజిల్లాలో చాలామంది అధికారులు నిర్లక్ష్యధోరణిలో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. మంగళవారం ఆయన రాయచోటి, కడప నియోజకవర్గాల్లో జన్మభూమి -మా ఊరు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం కడపలోని స్టేట్ గెస్టుహౌస్‌లో అధికారులతో జన్మభూమి అమలుతీరుపై సమీక్షించారు. కొందరు అధికారులు గత జన్మభూమిలో వచ్చిన సమస్యలపై ఏం చర్యలు తీసుకున్నది సమాచారం లేకుండా కార్యక్రమానికి మొక్కుబడిగా హాజరవుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జన్మభూమి కార్యక్రమంపై ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలను అధికారులకు పంపితే చాలామంది అధికారులు నిబంధనలు గాలికి వదిలి మొక్కుబడిగా కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజలకు సరైన సమాధానం చెప్పకుండా జన్మభూమి కార్యక్రమానికి వెళితే ఉపయోగం ఏమిటంటూ అధికారులకు అక్షింతలు వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇది మూడవ విడత జన్మభూమి కార్యక్రమమైనా అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితి క్షమించరానిదని హెచ్చరించారు.
అసెంబ్లీ అంటే లోటస్ పాండ్ కాదు
అసెంబ్లీ అంటే ఒక పవిత్ర దేవాలయమని, అటువంటి ఆలయంలో ప్రతి ఎమ్మెల్యే జవాబుదారీతనంతో వ్యవహరించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం కడపలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీని లోటస్ పాండ్, ఇడుపులపాయగా భావిస్తున్నారని, 2019 ఎన్నికల్లో వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు. నూతన రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు 5రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ప్రజాసమస్యలు, అభివృద్ధిని పక్కదారి పట్టించి కాల్‌మనీ వ్యవహారంపై రచ్చచేయడం ఏమేరకు సబబని ప్రశ్నించారు.

చిల్లూరులో జన్మభూమి ప్రతిజ్ఞ చేస్తున్న మంత్రి గంటా, ఎంపి సిఎం రమేష్