రాష్ట్రీయం

నోట్ల రద్దు వృథా ప్రయాసే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: ప్రపంచంలోని పెద్ద దేశాల్లో నగదురహిత లావాదేవీల విధానం అమల్లో లేదని, భారత్‌లో కూడా ఇది అసాధ్యమని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీలో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘నోట్లరద్దు-్ఫలితాలు’ అంశం పై మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎలాం టి నిర్ణయం తీసుకున్నా ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని, అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాలన్నారు. హడావుడి నిర్ణయాలవల్ల అనేక ఇక్కట్లు వస్తాయని నోట్లరద్దు వల్ల స్పష్టమైందన్నారు. నోట్ల రద్దుకు అనుబంధంగా నగదురహిత లావాదేవీల విధా నం తీసుకువస్తామంటూ కేంద్ర ప్రభు త్వం ప్రకటించిందని గుర్తుచేశారు. భారత్‌లో 97 శాతం లావాదేవీలు నగదు విధానంలోనే జరుగుతున్నాయని, అలాంటిది నగదురహిత విధానం ప్రాక్టికల్‌గా ఇబ్బంది అవుతుందన్నారు. పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆశించిన ఫలితాలేమీ ఒనగూరలేదని చిదంబరం పేర్కొన్నారు. ఈ విధానం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందన్నారు. నోట్లరద్దువల్ల దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న వ్యాపారులు, రైతులు నష్టపోయారన్నారు. నోట్ల రద్దు వల్ల బ్లాక్‌మనీని వెలికి తీయాలని, దొంగనోట్లను అరికట్టాలని, ఉగ్రవాదులకు నగదు లభించకుండా చేయాలని కేంద్రం భావించిందన్నారు. వాస్తవంగా ఇవేవీ జరగలేదన్నారు.