రాష్ట్రీయం

40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29:రాష్ట్రంలో త్వరలో 40 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించనున్నట్టు వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. అలాగే డయాలసిస్ రోగులకు జీవితకాలం మందులు ఉచితంగా అందజేయనున్నామన్నారు. గాంధీ ఆస్పత్రిలో అగర్వాల్ సమాజ్ సహాయత్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన కిడ్నీ సెంటర్‌ను మంత్రి ఆదివారం ప్రారంభించారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుం డా అగర్వాల్ సమాజ్‌లాంటి సహాయ సంస్థలు ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో ఎనిమిది వేలమందికి రెగ్యులర్‌గా డయాలసిస్ చేస్తున్నామని, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఏడు డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయని, వాటి సంఖ్యను 40కి పెంచుతున్నామని తెలిపారు. కిడ్నీ డయాలసిస్ రోగులకు జీవితాంతం ఉచితంగా మందులు అందజేయనున్నట్టు తెలిపారు. వ్యాధుల పట్ల అవగాహన ఉంటే వాటికి దూరంగా ఉండడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. రోగ నిరోధక పద్ధతులను ఆవలంబించాలని చెప్పారు. ముందుగా రోగ నిర్థారణ పరీక్షలు చేయించడం ద్వారా చికిత్సకు అవకాశం ఉంటుందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. స్వచ్ఛంద సేవకు అగర్వాల్ సమాజ్ సహాయత ట్రస్ట్ తరహాలో దాతలు, ట్రస్ట్‌లు, వ్యాపారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా మాట్లాడారు.