రాష్ట్రీయం

శాటిలైట్లతో సాగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: రాష్ట్రంలో దశలవారీగా కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం, దీనికి పూర్తిస్థాయిలో సాంకేతిక సమాచార వ్యవస్థను వినియోగించుకోనుంది. రాష్ట్రానికి కేటాయించిన నదీ జలాలను పూర్తిగా వినియోగించుకోవడంతోపాటు సాగునీటి వనరులను శాస్ర్తియంగా నిర్వహించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సి), భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో)లనుంచి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు వీలుగా నీటి వనరుల సమాచార వ్యవస్థ (టిడబ్ల్యుఆర్‌ఐఎస్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారీ, మధ్యతరహా సాగునీటి వనరులను ఏకీకృత జియో-స్పాషియమ్ డేటా బేస్‌తో వెబ్ ఆధారిత జియో పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు. దీనివల్ల నీటిపారుదల ప్రాజెక్టుల ప్రదేశం, జలాశయాల వివరాలు, ఆయకట్టు సమాచారాన్ని శాటిలైట్ చిత్రాల ద్వారా జలాశయాలలో గతిశీలక (డైనమిక్) నీటి విస్తరణ ప్రాంతం, కాలువ వ్యవస్థలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. నీటి లభ్యతను బట్టి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. చిన్నతరహా సాగునీటి వనరులకు (చెరువులు) జియోటాగ్ చేసి జలాశయాలు, ఆయకట్టు సమాచారం తెలుసుకుని సీజన్ల వారీగా సాగు చేసే పంటలకు నీరు విడుదల చేస్తారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు వచ్చే నదీ పరీవాహక ప్రాంతాల సమాచారం, వాస్తవిక నీటిస్థాయి, నది, ఉప నదుల ద్వారా జలాశయాలలోకి వచ్చే నీరు, బయటికి వెళ్లే నీటిపై జిల్లాలవారీగా సమాచారం అందుబాటులోకి వస్తుంది. వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ, పవన తీవ్రత, పవన దిశ హైడ్రోమెట్ డేటా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లనుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుబాటులో ఉంటుంది. దీనికి అదనంగా మొబైల్ అప్లికేషన్‌కు అనుసంధానం చేసి రోజువారీ జలాశయాలలో నీటి లభ్యతపై అవగాహనతో నీటి నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రాజెక్టులలో నీటి లభ్యత, పంటల సాగుకు వివిధ దశలలో అవసరమైన నీరు, పరీవాహక ప్రాంతాలలో ఆయకట్టు గ్యాప్ తదితర సమాచారాన్ని ప్రణాళికవేత్తలకు, నిర్ణాయకర్తలకు సహకరించడానికి ఈ అంతరిక్ష సమాచార వ్యవస్థ దోహదం చేస్తుంది.