రాష్ట్రీయం

సరిహద్దుల్లో ఇసుకాసురులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 29:మన ఇసుకను పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తవ్వుకుపోతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ శివారు గ్రామాల వద్ద ఇరు రాష్ట్రాల మధ్య పారుతున్న మంజీరా నది సాక్షిగా ఈ ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. మరో విషయమేమిటంటే...మహారాష్టన్రుంచి ఇసుక క్వారీల తవ్వకాలకు అనుమతి పొందిన కాంట్రాక్టర్లలో నిజామాబాద్, హైదరాబాద్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అంటే పొరుగు రాష్ట్రం మనవారితో మన కనే్న పొడుస్తోందన్నమాట. పైగా ఇలా తవ్విన ఇసుకను హైదరాబాద్ తరలించి కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకోవడం మరో విశేషం.
తెలంగాణలో ఇసుక తరలింపుపై ఆంక్షలు ఉన్న దరిమిలా, దీనిని అవకాశంగా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం మంజీరా సరిహద్దు ప్రాంతాల నుండి ఇసుక తరలించేందుకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులు జారీ చేస్తూ ఖజానా నింపుకుంటోంది. ఈ తతంగం మహారాష్ట్ర భూభాగంలో జరిగితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండేవి కావు. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందనే సాకుతో కాంట్రాక్టర్లు తెలంగాణ సరిహద్దులోకి చొచ్చుకువచ్చి జెసిబిలు, పొక్లెయినర్లు, ఇతర అధునాతన యంత్రాల సాయంతో విచ్చలవిడిగా ఇసుక తరలించేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు ఆనుకుని మహారాష్ట్ర పరిధిలో గల శావులం, గంజుగావ్, బోలెగాం, ఎస్గి, తమ్లూర్, సగ్రోలి, శేకాపూర్ తదితర పాయింట్ల నుండి ఇసుక తరలించేందుకు నాందేడ్ జిల్లా యంత్రాంగం టెండర్లు నిర్వహించగా, ప్రస్తుతం తమ్మూర్, శేకాపూర్, శావులం క్వారీల నుండి ఇసుక రవాణా కొనసాగుతోంది. అనుమతుల మాటున కాంట్రాక్టర్లు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మందర్న, హున్సా, తగ్గెల్లి తదితర గ్రామ శివార్లలో మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తవ్వి, అనునిత్యం వందలాది లారీల్లో తరలిస్తున్నారు. ఇదివరకు మహారాష్ట్ర క్వారీల నుండి ఇసుక లోడ్‌లతో వాహనాలు నిజామాబాద్ జిల్లా మీదుగానే హైదరాబాద్‌కు చేరుకునేవి. ప్రస్తుతం ఏస్గీ శివారులో చెక్ పాయింట్ ఏర్పాటు చేసి వాహనాలను కట్టుదిట్టంగా తనిఖీ చేస్తున్నారు. ఓవర్‌లోడ్ వాహనాలపై టన్నుకు 200 రూపాయల చొప్పున జరిమానా విధిస్తున్నారు. దీంతో ఇసుకాసురులు రూటు మార్చి దెగ్లూర్, హనెగాం, ఔరాద్‌ల మీదుగా జహీరాబాద్ నుండి హైదరాబాద్‌కు ఇసుక చేరవేస్తున్నారు. 10 టైర్ల లారీలో 40 టన్నులు, 12 టైర్ల లారీలో 50 టన్నుల వరకు ఇసుక లోడ్ చేసి బాహాటంగానే రవాణా చేస్తున్నారు. ఈ విషయమై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా కొనసాగిన సమయంలోనే ఇరు రాష్ట్రాల మధ్య పేచీ కొనసాగింది. అప్పటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వరప్రసాద్ ఈ ఇసుక దోపిడీని తీవ్రంగా పరిగణిస్తూ నాందేడ్ జిల్లా కలెక్టర్‌కు మూడు పర్యాయాలు లేఖలు రాశారు. తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తవ్వకాలు జరుపుతున్నందున సరిహద్దు నిర్ధారణకై ఉమ్మడి సర్వే నిమిత్తం అధికారులను పంపించాలని, ఈ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఇసుక తరలింపునకు అనుమతులు జారీ చేయరాదని కోరారు. ఈ విజ్ఞప్తులను మహారాష్ట్ర బుట్టదాఖలు చేసింది.

చిత్రాలు..ఇసుక రవాణాకు బారులుతీరి ఉన్న లారీలు, ఇసుకను లారీల్లో నింపుతున్న దృశ్యం