రాష్ట్రీయం

ఎక్స్‌ప్రెస్ హైవేలపై ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 5: రాజధాని నిర్మాణాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్, గ్రామకంఠాల రూపురేఖలపై ప్రజలకు స్పష్టత రావటంతో ఎక్స్‌ప్రెస్ హైవేలపై నిర్మాణం వలన జరిగే నష్టంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. తుళ్లూరు ప్రజలు ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణాల వలన ఎన్ని ఇళ్లు తొలిగించాల్సి వస్తుందనే భయాందోళనలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కృష్ణాయపాలెంలో రహదారి నిర్మిస్తే 60 శాతం గ్రామాన్ని వదులు కోవాల్సి వస్తుందనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని శ్రీకోదండ రామాలయం గర్భగుడి తొలిగించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఆలయం తొలగిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామానికి చెందిన కె అనిల్ మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ కింద 40 ఎకరాల భూమిని ఇచ్చానని, గ్రామంలో రహదారి వేస్తే తన ఇల్లు సగంగా చీలి పోతుందని సిఆర్‌డిఎ అధికారులు చెప్పటంతో ఆందోళనగా ఉందన్నారు. భూములిచ్చిన సమయంలోగ్రామాలను వదలి రహదారులు నిర్మిస్తామని చెప్పిన అధికారులు ప్రస్తుతం ఏమీ మాట్లాడటం లేదన్నారు. సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలనే ఉద్దేశంతో సోమవారం జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించామని గ్రామస్థులు తెలిపారు. మరలా జన్మభూమి నిర్వహించాలని చూస్తే మాత్రం ఊరుకోమన్నారు. సిఆర్‌డిఎ కార్యాలయాల్లో గ్రామకంఠాలకు సంబంధించిన అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చునని అధికారులు తెలియజేసిన నేపథ్యంలో గ్రామస్థులు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే విజ్ఞాపనలకు సమాధానం వస్తుందా అనే మీమాంసలో రైతులు ఉన్నారు. గతంలో 10,200 రైతులు 9.2 ద్వారా భూములిచ్చేందుకు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని గుర్తుచేస్తున్నారు. రహదారుల నిర్మాణం వలన గృహాలు కొల్పోయిన వారికి గ్రామాల వెలుపల గల భూములిస్తామని, గృహాలు తొలగిస్తే ఆర్‌అండ్‌బి అధికారులు విలువను నిర్ధారించిన తరువాత అంతే విలువ గల స్థలాన్ని ఇస్తామని సిఆర్‌డిఎ అధికారులు చెప్పటంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. సిఆర్‌డిఎ అధికారులు ఇచ్చిన వివరణ ఎంత మాత్రం సమ్మతం కాదంటూ కృష్ణాయపాలెం గ్రామస్థులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందజేసారు. గ్రామానికి చెందిన ఎ వెంకటేశ్వర్లు, ఎంఎస్‌ఎన్ ప్రసాదు, ఎం అమర్‌నాథ్, కె రాజారావు, వై వెంకాయమ్మ తదితరులు వినతిపత్రంపై సంతకాలు చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోజరిగే సమావేశంలో పాల్గొని గ్రామాల్లో ఎక్స్‌ప్రెస్ హైవేలు వేస్తే నష్టపోతున్న ప్రజల సమస్యపై మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం వలన ఐనవోలు గ్రామం 100 శాతం, కృష్ణాయపాలెం 60 శాతం నష్టపోతుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్ హైవేలపై స్పందించాలని, లేనిపక్షంలో మూకుమ్మడిగా వ్యతిరేకించి భూసమీకరణకు ఇచ్చిన పొలాల్లో పంటలు వేస్తామని, భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి పొలాలు తీసుకోమని డిమాండ్ చేస్తామంటున్నారు. మందడం గ్రామస్థులు మాట్లాడుతూ అందరం కలిసి 3,000 ఎకరాలకు పైగా భూసమీకరణ కింద ఇస్తే ప్రస్తుతం స్థలాలు ఎక్కడ కేటాయిస్తారో వెల్లడించటం లేదని వాపోతున్నారు. కొంత మందికి ఇక్కడ స్థలాలు కేటాయించి, మిగిలిన వారికి వేరే రెవెన్యూ గ్రామంలో ఇస్తే చూస్తూ ఊరుకోమని, ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామస్థులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన 29 గ్రామాల ప్రజలు కోరుతున్నారు.