రాష్ట్రీయం

టీచర్ల అంతర్ జిల్లా బదిలీలకు పచ్చజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల అంతర్‌జిల్లా బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఉపాధ్యాయుల పరస్పర, స్పౌజ్ కేటగిరిలో అంతర్‌జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్ పి సిసోడియా చెప్పారు. పరస్పర , స్పౌజ్ అంతర్ జిల్లాల బదిలీలకు ప్రతిపాదనలు వస్తే ఎప్పటికపుడు జిఎడి అనుమతి తీసుకుని వాటిని అమలుచేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న టీచర్లు అంతర్‌జిల్లా బదిలీలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు డిఇఓల ద్వారా ప్రతిపాదనలు పంపించుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులు 86 మేరకు రాష్ట్రప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్శిటీలు, స్థానిక సంస్థలలో పనిచేస్తున్న వారితో స్పౌజ్ కేటగిరి వర్తిస్తుందని, పరస్పర బదిలీలకు అదే మేనేజిమెంట్ , ఒకే కేటగిరి వారితో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ప్రభుత్వ చర్యను యుటిఎఫ్ అధ్యక్షుడు ఐ వెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి పి బాబురెడ్డి అభినందించారు.