రాష్ట్రీయం

విద్యార్థుల నుంచి వసూళ్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రతి విద్యార్థి,ఉపాధ్యాయుల నుంచి 10 రూపాయిలు సేకరించాలన్న ఎపి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు బుధవారం స్టే విధించింది. విద్యార్ధుల నుండి విరాళాల సేకరణకు సర్క్యూలర్‌ను ఎలా విడుదల చేస్తారని హైకోర్టు న్యాయమూర్తి పి వి సంజీవ్ కుమార్ ప్రశ్నించారు. విరాళాల సేకరణకు ఆదేశాలు ఇచ్చే అధికారం అధికారులకు లేదని స్పష్టం చేశారు. విద్యార్ధులు లేదా ఉపాధ్యాయుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్టు న్యాయస్థానం దృష్టికి వస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ఎవరైనా ఇస్తే అభ్యంతరం లేదన్నారు. విరాళాల సేకరణను సవాలు చేస్తూ మంగళగిరికి చెందిన ఎస్ కె బషీర్ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. విద్యార్ధులు, ఉపాధ్యాయుల నుంచి విరాళాలు సేకరించడం తగదని, విద్యాశాఖ కమిషనర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. తొలుత పిటిషన్‌ను హైకోర్టు లంచ్‌మోషన్‌గా స్వీకరించింది. రాజ్యాంగంలోని హక్కులకు భంగం వాటిల్లేలా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని, ఆర్టికల్ 21ఎను ఉల్లంఘిస్తున్నాయని, విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని పిటిషనర్ వాదించారు. రాష్ట్రప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని న్యాయమూర్తి ప్రభుత్వ ఆదేశాలపై స్టే విధించారు. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేశారు.