ఆంధ్రప్రదేశ్‌

కెఈ కొడుకు అక్రమాలపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: కర్నూలు జిల్లాలో హంద్రీ నది నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి వ్యవసాయ భూములను విధ్వంసం చేసే విధంగా లారీల అక్రమ రవాణా జరుగుతున్నా, అధికారులు వౌనంగా ఎందుకు చూస్తూ ఊరుకున్నారంటూ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కుమారుడిపై వచ్చిన అభియోగాలపై విచారణకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కర్నూలు జిల్లా కోడుమూరు, కృష్ణగిరి మండలానికి చెందిన బజారి తదితర 11 మంది రైతులు ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని, అధికారులు చోద్యం చూస్తున్నారంటూ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాలో ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు ప్రమేయం ఉందంటూ పిటిషనర్లు పిల్‌లో అభియోగాలు మోపారు. ఈ కేసుపై హైకోర్టు ఆదేశం మేరకు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ విచారణ జరిపారని, గ్రామస్తులు వివరాలు చెప్పేందుకు ముందుకు రాలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. శ్యాంబాబుపై ఆరోపణలు చేసినప్పుడు అధికారులు ఎందుకు వెంటనే చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిన వెంటనే సిఎంఒ కార్యాలయం జిల్లా కలెక్టర్ ద్వారా మైన్స్ శాఖకు ఫిర్యాదును పంపిందని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని ‘కోర్టు ఆదేశాలను మీ అధికారులు ఖాతరు చేయడం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం అదేశాలను కూడా అధికారులు పట్టించుకోనట్లు కనపడుతోంది. కలెక్టర్ కార్యాలయం తమకు వచ్చిన ఫిర్యాదును కేవలం మైన్స్‌శాఖకు పంపించి చేతులు దులుపుకుంది.’ అని వ్యాఖ్యానించింది. పౌరుల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు అందులో నిజానిజాలను తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇసుక అక్రమ తవ్వకాలు, వ్యవసాయ భూముల ద్వారా తరలించడంపై పలుసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెంటనే హైకోర్టు జోక్యం చేసుకుని పాడై పోయిన రోడ్లు, వ్యవసాయ భూములు తదితర వివరాలను ఫోటోలు తీసి అఫిడవిట్ ఇవ్వాలని హైకోర్టు పిటిషనర్ తరఫున న్యాయవాదిని ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.