రాష్ట్రీయం

కాపుల అభివృద్ధికి ముద్రగడ అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: కాపుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీని విమర్శించడమే ముద్రగడ పనిగా పెట్టుకున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమల శెట్టి రామానుజయ్య ధ్వజమెత్తారు. కాపులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఆనాడు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. టిడిపి కాపుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే విమర్శించడం దారుణమని అన్నారు. కాపుల అభివృద్ధికి కృషి చేస్తున్న టిడిపిని విమర్శించడం దిగజారుడుతనమేనని చలమలశెట్టి విమర్శించారు. కాపులను బిసిల్లో చేరుస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పి అమలుచేయకుండా పదేళ్లపాటు కాలక్షేపం చేసిందని, ఈ విషయాన్ని ఎన్నో మార్లు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదని అన్నారు. 2004 నుండి 2014 వరకూ కాపుల సంక్షేమానికి అప్పటి ప్రభుత్వాలు చేసిన కృషి శూన్యమని ముద్రగడ పద్మనాభంకు తెలియదా? అని ప్రశ్నించారు. టిడిపి అత్యధిక సీట్లు కాపు సామాజిక వర్గానికి కేటాయించి వారికి పదవులిచ్చి ప్రోత్సహించిందని చెప్పారు. ఎందరినో పెద్ద నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్ , చంద్రబాబులకే దక్కుతుందని, తాజాగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి మొదలైన కులాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా టిడిపిదేనని చలమలశెట్టి స్పష్టం చేశారు

కాపు కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ కెఎల్ మంజునాథ్

హైదరాబాద్, జనవరి 6: కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లో కాపు కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. కాపులను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ఉద్ధేశించిన కాపు కార్పొరేషన్‌కు అంకురార్పణ చేసిన చంద్రబాబు దానికి వంద కోట్లు ఇవ్వడంతో పాటు చైర్మన్‌గా చలమలశెట్టి రామానుజయ్యను నియమించారు. ఇక కాపుల రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వివిధ సామాజిక వర్గాలు, ప్రత్యేకించి బిసిల నుండి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను చల్లబరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక పక్క జగన్ దాసరిని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తుండటం మరో పక్క పవన్‌కళ్యాణ్ రోజుకో తీరుతో మాట్లాడుతుండటంతో కాపువర్గం విషయంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించి సమీక్షించినట్టు తెలిసింది. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు కాపుల స్థితి గతుల అధ్యయనానికి కాపు కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉత్తర్వులను సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి కృష్ణారావును ఆదేశించినట్టు సమాచారం. ఈ కమిషన్‌కు కర్నాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె. ఎల్ మంజునాధ్ అధ్యక్షులుగా నియమితులు కానున్నట్టు తెలిసింది.

ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా రెండు రోజుల్లో రానుంది.