రాష్ట్రీయం

ప్రణాళిక వ్యయానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు రాష్ట్ర ప్రణాళికా వ్యయానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ దిశలోనే ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఆదేశాలు, సూచనల మేరకే వివిధ శాఖలు తమ బడ్జెట్‌ను (2016-17) రూపొందిస్తున్నాయి. గతంలో ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా కొంత కాలం పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖను చంద్రబాబు నిర్వహించారు. వాస్తవానికి చంద్రబాబుకు ‘సంస్కరణలు’ అంటే చాలా మక్కువ. అందుకే పరిపాలనలో ఆర్థిక యాజమాన్యం సమర్థతగా ఉండాలని ఆయన భావిస్తున్నారు. ప్రజలకు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే మరోవైపు అభివృద్ధి దిశలో సాగే విధంగా బడ్జెట్‌ను రూపొందించాలని ఆదేశించారు.
2015-16 సంవత్సరానికి రూపొందిచిన రాష్ట్ర బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయానికి 34,412 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్‌లో కేవలం 30 శాతం నిధులను మాత్రమే ప్రణాళికా వ్యయానికి కేటాయించారు. దీన్ని 2016-17 సంవత్సరానికి 40 శాతం వరకైనా పెంచాలని భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 1,30,000 కోట్లతో మొత్తం బడ్జెట్‌ను ప్రతిపాదించే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. అంటే ప్రణాళికా వ్యయానికి 50వేల కోట్ల రూపాయల వరకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీన్ని నెమ్మదినెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాలని భావిస్తున్నారు. ప్రపంచబ్యాంకు, కేంద్రప్రభుత్వం, విదేశాల్లో ఉన్న వివిధ సంస్థలతో పాటు ప్రజల నుండి బాండ్లు తదితర మార్గాల ద్వారా సేకరించే నిధులను అభివృద్ధి కార్యక్రమాలకే ఎక్కువగా వాడాలని భావిస్తున్నారు. పన్నులు, తదితర మార్గాల ద్వారా లభించే నిధులను సంక్షేమ తదితర కార్యక్రమాలకు వినియోగించాలని భావిస్తున్నారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ పి.వి. రమేష్ తదితర ఉన్నతాధికారులతో ఈ కోణంలోనే సమావేశాలో నిర్వహించి సమీక్షిస్తున్నారు.
నీటిపారుదల, విద్యుత్తు, వ్యవసాయం, పరిశ్రమలు, ఐటి, పోర్టుల అభివృద్ధి, రోడ్లు, భవనాలు తదితర అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున కొనసాగేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఆ యా శాఖల ఉన్నతాధికారులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్ కలిసి బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజధాని అమరావతి కోసం ఎక్కువ నిధులు లభించేలా ప్రణాళికలకు రూపం ఇస్తున్నారు. 2015-16 సంవత్సరంలో అమరావతికి 3168 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, ఈ నిధులు సరిపోవడం లేదు. కొత్త బడ్జెట్‌లో ఇందుకోసం ప్రాధాన్యత లభిస్తోంది. యనమల ఇక నుండి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను పూర్తి చేసే వరకు దీనిపైనే దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు.