రాష్ట్రీయం

దిగజారిన రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జనవరి 6: రాష్ట్రంలో ఎన్నడూ, ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలు దిగజారిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం తుగ్గలి మండలం రాతన గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాను గతంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఎన్టీరామరావు హయాంలో మంత్రిగా పని చేశానన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించానన్నారు. మొన్న శాసనసభలో జరిగిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ ఎదురు కాలేదన్నారు. కొందరు అసెంబ్లీలోనే తనను ఉద్దేశించి నానా తిట్లు తిట్టారని పరోక్షంగా వైకాపా నేతలపై విమర్శలు చేశారు. అసెంబ్లీలో కొందరు కాల్‌మనీ వ్యాపారంపై మాట్లాడుతూ సీట్లో కూర్చున్న తన వద్దకు వచ్చి ‘కాల్ ముఖ్యమంత్రి’, ‘కామ ముఖ్యమంత్రి’ అంటూ తన వద్ద ఉన్న కాగితాలు లాకున్నారన్నారు. ఇలాంటి ప్రతిపక్షం చర్యలు సిగ్గుచేటన్నారు. అలాంటి వారి ఆటలు తనవద్ద సాగవని, వారిని ఎదుర్కొంటానని సిఎం స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పుచేయలేదని, క్రమశిక్షణ కల్గిన వ్యక్తిని అని అందువల్లే ఇప్పటికీ రాజకీయాల్లో నిజాయితీగా కొనసాగుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని గౌరవించకపోతే, ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే ఎలా అని అన్నారు. కాల్‌మనీ వ్యాపారం ఎప్పటి నుంచో సాగుతోందని, అయితే ఇప్పుడు శృతి మించిందన్నారు. బాధిత మహిళ ఒకరు ఫిర్యాదు చేయగా పోలీసు కమిషనర్ తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీనిపై వెంటనే స్పందించి కాల్‌మనీ నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించానన్నారు. కాల్‌మనీలో ఎవరు ఉన్నా ఉపేక్షించేదిలేదని బాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంటే వారు అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష సభ్యులపై విమర్శలు గుప్పించారు. ప్రజల్లో అసహనం పెంచి వేడుకగా చూస్తున్నారన్నారు. పట్టిసీమ, అమరావతి ప్రాంతాల్లో రైతులను రెచ్చగొట్టి అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు 24 గంటలు పనిచేస్తున్నానని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేంత వరకు నిద్రపోనని బాబు స్పష్టం చేశారు. 2050 సంవత్సరం నాటికి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.