రాష్ట్రీయం

పేద జిల్లాలకు ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 7: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోపే రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని ప్రకటిస్తారని కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ప్రధానితో చర్చించి తమవంతు కృషి చేస్తానన్నారు. దేశంలో 12కోట్లమంది చిరు వ్యాపారులున్నారని, వారి వ్యాపారాభివృద్ధి నిమత్తం కేంద్రం ప్రవేశపెట్టిన ముద్ర పథకం కింద రుణాలివ్వడంలో నిర్లక్ష్యం వహించే బ్యాంకర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో అధికంగా సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయని, ఈ సిమెంట్ కర్మాగారాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఎర్రగుంట్లలో కార్మికుల సంక్షేమం కోసం 50 పడకలతో ఇఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం వెనుకబడిన జిల్లాల్లో పరిస్థితులు తెలుసుకోవడానికి ఒక్కో జిల్లాకు ఒక్కో కేంద్రమంత్రిని పంపారని, ఇందులో భాగంగా తనను కడపకు పంపించారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేసేందుకు రాష్ట్రానికి అవసరమైన నిధులను కేంద్రం అందిస్తుందని స్పష్టంచేశారు. ముంబయి తర్వాత ప్రొద్దుటూరులో బంగారు, వస్త్ర వ్యాపారం అధికంగా ఉందని, వాణిజ్య, వ్యాపారపరంగా ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరుచేసి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తుందన్నారు. పులివెందుల, సింహాద్రిపురంలో రైతులతోను, ఎర్రగుంట్లలో కార్మికులతో, ప్రొద్దుటూరులో మహిళ, యువత, వైద్యులు, వ్యాపారులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. సదానంద వెంట కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, బిజెపి సీనియర్ నాయకుడు కందుల రాజమోహన్‌రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు వి శశిభూషణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.