రాష్ట్రీయం

బస్సులే బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని నేటి నుంచి 14 వరకు 2698 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండి ఎన్ సాంబశివరావు వెల్లడించారు. ప్రత్యేక బస్సులకుతోడు 486 రెగ్యులర్ సర్వీసులనూ తిప్పుతున్నట్టు చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో దాదాపు 1200 బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్య కల్పించామన్నారు. 8నుంచే రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. గురువారం బస్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ భోగి ముందురోజు దాదాపు లక్షమంది హైదరాబాద్ నుంచి బస్సుల్లో వివిధ గమ్యస్థానాలకు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అధిక రద్దీ నియంత్రణకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు, రెగ్యులర్ సర్వీసులే కాకుండా మరో 400 బస్సులు అప్పటికప్పుడు అవసరాన్నిబట్టి నడిపేందుకు సిద్ధం చేశామన్నారు. పండుగ రద్దీని అనుసరించి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు వీలుగా బస్సు రవాణా సదుపాయం కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరం నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక బస్సులు బయలుదేరేందుకు వీలుగా 23 బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. వీటిని ఇడి స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారన్నారు. ఎంజిబిఎస్ వద్ద ట్రాఫిక్ ఇబ్బంది దృష్టిలో ఉంచుకుని విజయవాడ, గుంటూరు, నెల్లూరు వైపునకు వెళ్లే అన్ని బస్సులను ఎల్‌బి నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డింగ్ పాయింట్ల నుంచి పంపిస్తున్నట్టు తెలిపారు. ఎల్‌బి నగర్ పాయింట్ నుంచి కేవలం ప్రత్యేక బస్సు సర్వీసులు మాత్రమే బయలుదేరతాయని, రెగ్యులర్‌గా తిరిగే అన్ని సర్వీసులు యథాతథంగా ఎంజిబిఎస్ నుంచే బయలుదేరతాయన్నారు. జంటనగరాల్లో బిహెచ్‌ఇఎల్, కెపిహెచ్‌బి, ఎస్‌ఆర్ నగర్, ఇసిఐఎల్, జీడిమెట్ల ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరతాయని తెలిపారు. రాయలసీమ వైపునకువెళ్లే అన్ని బస్సులు సిబిఎస్ ఓల్డ్ హేంగర్ నుంచి బయలుదేరుతాయన్నారు. నష్టాల్లోవున్న ఏపిఎస్‌ఆర్టీసీని గట్టెక్కించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు ఎండి తెలిపారు. 2014-15లో రూ.600 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. నష్ట నివారణ చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది ప్రధానంగా సిబ్బంది జీతాల పెంపు, డీజిల్ ధర తగ్గింపు, చార్జీల పెంపువంటి చర్యలు చేపట్టినట్టు చెప్పారు. జీతాల పెంపువల్ల నెలకు 45 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. నష్టాన్ని డీజిల్ ధర తగ్గింపువల్ల వచ్చే ఆదాయం రూ.20 కోట్లు, చార్జీల పెంపువల్ల వచ్చే ఆదాయం మరో 25 కోట్ల ద్వారా భర్తీ చేసుకుంటున్నట్టు ఎండి చెప్పారు. ఈ చర్యల కారణంగా దాదాపు 160 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 2016లో పాత బస్సులు వెయ్యి తొలగించి వాటిస్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. మరో 750 అద్దె బస్సులనూ తీసుకుని నడుపుతున్నట్టు ఆయన తెలిపారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి బస్‌టెర్మినస్ ఏర్పాటుకు 215 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్టు చెప్పారు. అమరావతిలో ఏర్పాటయ్యే 9 థీమ్ సిటీల్లో 9 బస్‌స్టేషన్ల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. 2016 మార్చినాటికి ఆర్టీసీ భవన్ విజయవాడలో భారీస్థాయిలో ఏర్పాటు పూర్తి అవుతుందన్నారు. ఆర్టీసి హాస్పిటల్ ఏర్పాటు అంశంలోనూ ఈ నెలలో నిర్ణయం తీసుకుంటామన్నారు.