రాష్ట్రీయం

త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 7: గ్రూప్-1 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీకానుందని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. డిఎస్సీ ద్వారా రాష్ట్రంలో సుమారు 9వేల టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీచర్లు, డాక్టర్లు తదితర ప్రాముఖ్యత కలిగిన పోస్టులను కాంట్రాక్టు విధానంలోనూ భర్తీ చేయనున్నట్టు చెప్పారు. మొత్తం మీద త్వరలో సుమారు 20వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం చీడిగలో గురువారం నిర్వహించిన జన్మభూమి- మా ఊరులో యనమల మాట్లాడారు. ఇళ్లు లేని పేదలు ఉండకూడదన్న ఆశయంతో ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం చేపట్టిందన్నారు. హడ్కో నుండి 10వేల కోట్లు రుణంగా తీసుకుని, రాష్టవ్య్రాప్తంగా గ్రామాలలో 2 లక్షల ఇళ్ళు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. డ్వాక్రా యానిమేటర్లు సరిగా పని చేయకుండా, హక్కుల కోసం పోరాడటం మంచి పద్ధతి కాదన్నారు. బాధ్యత మరచి, హక్కుల కోసం పోరాడేవారిని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని యనమల హెచ్చరించారు.