రాష్ట్రీయం

జగన్ పరామర్శించారని పెన్షన్ కట్ చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం: ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామానికి చెందిన రైతు పండ్ల సత్యనారాయణ 2015 లో బలవన్మరణం పాలయ్యాడు. తనకున్న 8 ఎకరాల్లో పంటలు సాగు చేశాడు. రెండుసార్లు అరటి పంట వేసినా తీవ్ర నష్టం రావడం, రూ.2.50 లక్షలు ఖర్చు చేసినా చుక్క నీరు పడలేదు. సుమారు రూ.8 లక్షలు అప్పు భారంగా మారింది. ఆత్మహత్యే శరణ్యమైంది. అతని పెద్ద కుమారుడు సూర్యనారాయణ బెంగళూరులో ఉంటున్నాడు. రెండో కొడుకు రామాంజనేయులు ట్రాక్టర్ మెకానిక్‌గా కడపలో స్ధిరపడ్డాడు. చిన్న కొడుకు నారాయణస్వామి ఊర్లోనే రూ.2.50 లక్షలు ప్రైవేటు ఫైనాన్స్‌లో అప్పు తీసుకుని ఆటో నడుపుకుంటూ తల్లిని రామేశ్వరమ్మను చూసుకుంటున్నాడు. ఆమె చిన్న టీ దుకాణం పెట్టుకుని బతుకీడుస్తోంది. ఇప్పటికి ఆమెకు కేవలం 3 ఎకరాల భూమి మిగిలింది. ఒక్క బోరులో అరకొరగా నీరోస్తోంది. రూ.4 లక్షలు అప్పు మిగిలింది. ‘్భర్త మరణానంతరం నాకు వృద్ధాప్య పెన్షన్ తీసేశారు. జగన్ మమ్మల్ని పరామర్శించాడని ప్రభుత్వం కక్ష సాధించింది. ఎన్నిసార్లు అర్జీలిచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ఉపాధి హామీ పథకం కింద పెట్టిన మామిడి చెట్ల బిల్లులు రూ.లక్ష దాకా ఎగ్గొట్టారు’ అని రామేశ్వరమ్మ వాపోయింది.

చిత్రం..పెన్షన్ దరఖాస్తు చూపిస్తున్న రామేశ్వరమ్మ