రాష్ట్రీయం

సోమయాజులు శర్మకు నోరి పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: ప్రతిష్టాత్మక కవి సామ్రాట్ నోరి నరసింహశాస్ర్తీ పురస్కారం ఈ ఏడాది గరిమెళ్ల అచ్యుత సత్యశేషగిరి సోమయాజులు శర్మకు ప్రదానం చేస్తున్నట్లు నోరి నరసింహశాస్ర్తీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ ఒక ప్రకటనలో తెలిపారు. మహాభారత కంటకోద్ధార తదితర 18 సంస్కృత గ్రంథాలు, తెలుగులో సుమారు 14 కృతులు, పీఠికలు, వ్యాసాలు, అనువాదాలు ఎన్నో చేసిన లబ్ధ ప్రతిష్ఠులు అయిన సోమయాజులు శర్మకు ఈ పురస్కారం అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రూ.15 వేల నగదు, పళ్లెము, సన్మాన పత్రాన్ని ఈ పురస్కారం కింద అందజేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 7న నోరి నరసింహశాస్ర్తీ 116వ జయంతి సందర్భంగా చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తామని ఆయన వెల్లడించారు.

విద్యార్థుల విరాళాల కేసును మూసివేసిన హైకోర్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 7: ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులు, టీచర్ల నుంచి విరాళాలు వసూలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ముగించినట్లు హైకోర్టు గురువారం ప్రకటించింది. తాము విరాళాలను స్వచ్ఛందంగా ఇవ్వవచ్చని సర్క్యులర్‌ను జారీ చేశామని తెలియచేస్తూ ఆంధ్రప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదికను సమర్పించింది. పిటిషనర్లు చేసిన అభియోగాలు నిరాధారమని కూడా పేర్కొంది. ఈ సర్క్యులర్‌ను రికార్డుగా స్వీకరిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. కొత్త సర్క్యులర్‌ను జారీ చేసినందువల్ల ఈ రెండు పిటిషన్లపై విచారణ ఉండదని, కేసును ముగిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ ప్రకటించారు.