రాష్ట్రీయం

ఆగిన భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2:నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) చేదువార్త వినిపించింది. ఇటీవల విడుదల చేసిన గురుకుల ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లను ఉపసంహరించుకున్నట్టు గురువారం ప్రకటించింది. గురుకులాల్లోని వివిధ కేటగిరి ఉద్యోగాలకు ఫిబ్రవరి 6న టిఎస్‌పిఎస్‌సి తొమ్మిది నోటిఫికేషన్లు విడుదల చేసింది. దరఖాస్తులకు మార్చి 4 వరకూ గడువు ఉంది. గురుకులాల్లో పిజిటి, టిజిటి, ఫిజికల్ డైరెక్టర్లు, క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్ టీచర్లు, లైబ్రేరియన్లు, నర్సులు తదితర 7,306 పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి రంగం సిద్ధం చేసింది. దీంతో నిరుద్యోగులు సంబరపడిపోయారు. అయితే ఫిబ్రవరి 6న ప్రకటించినవాటిలో తొమ్మిది నోటిఫికేషన్లను కమిషన్ ఉపసంహరించుకుంది. వివిధ శాఖల నుండి వచ్చిన సవరణల కారణంగా నోటిఫికేషన్లు ఉపసంహరించుకుంటున్నట్టు కమిషన్ అధికారులు వివరించారు. తగిన సవరణలతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్లను విడుదల చేస్తామని తెలిపారు. అయితే ఆ ప్రక్రియ ఎంత త్వరగా పూర్తవుతుంది, కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువరిస్తారు అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ విడుదల చేసినపుడే విద్యార్హతలపైనా, నిబంధనలపైనా, ఉత్తీర్ణతా శాతంపైనా నిరుద్యోగుల నుండి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా పిజిటి పోస్టులకు 60 శాతం మార్కులు రావాలన్న నిబంధన విధించడంతో నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వాటన్నింటిపై సర్వీసు కమిషన్ వివరణ ఇచ్చినా, నిరుద్యోగులనుంచి పెద్దయెత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి స్వయంగా ఈ అంశంపై వివిధ గురుకులాల కార్యదర్శులు, ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ సొసైటీల్లో ఒకే పోస్టుకు సంబంధించి రెండు రకాల అర్హతలు విధించడంపై అభ్యర్ధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే విధంగా ఉత్తీర్ణతాశాతంపై విధించిన నిబంధనలు కూడా సడలించాలని కోరడంతో కొన్నింటిని ఆమోదించిన ముఖ్యమంత్రి తదనుగుణంగా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. ఆ తర్వాత వివిధ గురుకులాల కార్యదర్శులు, అధికారులు, పాఠశాల విద్యాశాఖ అధికారుల మధ్య సమన్వయం కుదరకపోవడంతో 25 రోజులు గడిచిపోయింది. ఇంతలో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణను కమిషన్ నిలిపివేయడంతో నిరుద్యోగులు గగ్గోలు పెట్టారు. ఈ క్రమంలో దరఖాస్తుల స్వీకరణ లింక్‌ను సైతం కమిషన్ తొలగించింది.
మా సంగతి ఏమిటి?
నోటిఫికేషన్ రాగానే సెలవులు పెట్టి ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా నోటిఫికేషన్ ఉపసంహరించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని, తాజా నోటిఫికేషన్ ఎప్పుడు వెలువరిస్తారో కూడా చెప్పకపోవడం దారుణమని వారు వాపోతున్నారు.