రాష్ట్రీయం

టెన్త్ విద్యార్థులకు ఎర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రలోనూ టెన్త్ విద్యార్థులకు ఎర వేసే జిమ్మిక్కులను ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు ప్రారంభించాయి. ఫీజు రాయితీలు, ఉచిత భోజనం, ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించడంతో పాటు ప్రతిభ గల విద్యార్థులకు అదనపు ఆకర్షణలు కూడా కల్పిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైస్కూళ్లలో మెరికల్లాంటి విద్యార్థులను గత ఏడాదిగా స్కానింగ్ చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు వారి ప్రతిభాపాటవాలపై నిఘా పెట్టాయి. వారి ప్రతిభా నివేదికలను గమనించిన కార్పొరేట్ కాలేజీలు మెరిట్ విద్యార్థులకు గాలం వేస్తన్నాయి. ప్రైవేటు డేస్కాలర్ జూనియర్ కాలేజీల్లో, రెసిడెన్షియల్, రాపిడ్ రెసిడెన్షియల్, స్పార్క్ రెసిడెన్షియల్, సెంట్రల్ ఆఫీసు స్పార్క్ (కో స్పార్క్) వంటి పేర్లతో అడ్మిషన్లను చేపడుతున్నాయి. టెన్త్ పరీక్షలు మార్చి 21న ప్రారంభం కానున్నాయి. అంటే ఇంకా దాదాపు మూడు నెలల వ్యవధి ఉంది. అయినా కార్పొరేట్ కాలేజీల ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి పదో తరగతి విద్యార్థులకు ఎర వేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర ఎస్సెస్సీ పరీక్షల బోర్డుల నుండి విద్యార్థుల నామినల్ రోల్స్‌ను సంపాదిస్తున్న కార్పొరేట్ కాలేజీలు సెల్‌ఫోన్లకు నేరుగా ఫోన్ చేసి విద్యార్థులకు కౌనె్సలింగ్ ఇస్తున్నారు. కనీసం పది వేలు కట్టి సీటు రిజర్వు చేసుకోవాలని, టెన్త్ పరీక్షలు గడిచిన తర్వాత వస్తే సీట్లు ఉండవని భయపెట్టడంతో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. హాస్టల్ సీటు కావాలా రెండున్నర లక్షలు కట్టండి, డే స్కాలర్ సీట్లు కావాలంటే లక్షన్నర కట్టండి అంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫీజులకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో కాలేజీలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. సాధారణ బ్రాంచీలలో ఒక ఫీజు, సెంట్రల్ ఆఫీసు అయితే మరో ఫీజు, స్పార్క్ బ్యాచ్ అయితే ఇంకో ఫీజు అంటూ ఫీజుల చిట్టా విప్పుతున్నాయి. విద్యార్థులు టెలిఫోన్లలో ఫీజుల గురించి మాట్లాడితే, ఫోన్లలోచెప్పేది లేదు, కాలేజీలకు రండి మాట్లాడుకోండి అంటూ యాజమాన్యాలు చెబుతున్నాయి.దీంతో అనివార్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లి అడ్వాన్స్‌లు చెల్లించి సీటు రిజర్వు చేసుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా ఎన్నో ఆంక్షలు, నిబంధనలూ ఉన్నా దర్జాగా కాలేజీల యాజమాన్యాలు మాత్రం కంప్యూటర్ ప్రింటవుట్లు ఇస్తున్నాయి. ఏప్రిల్ రెండో వారం నుండే కోచింగ్ క్లాసులు మొదలవుతాయని, తప్పనిసరిగా వాటికి హాజరుకావాలని కూడా హెచ్చరిస్తున్నాయి. 2016 జూన్‌లో కాలేజీలు తెరిచేనాటికి స్పార్క్ బ్యాచ్‌లలో చేరుతున్న విద్యార్థులకు ఫస్టియర్ సిలబస్‌ను పూర్తి చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నాయి.