రాష్ట్రీయం

నిమిషం లేటయినా వేటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని, ఈ నిబంధన యధావిధిగా కొనసాగుతుందని ఇంటర్మీయట్ బోర్డు ప్రకటించింది. ఒక నిమిషం నిబంధన వల్ల పలువురు విద్యార్థులు పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్‌జామ్‌ల వల్ల సకాలంలో పరీక్షాకేంద్రానికి చేరుకోలేక అనేకమంది విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోతున్నారు. దీంతో బోర్డు నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకే ఈ నిబంధన విధించామని, దీనిని కొనసాగిస్తామని బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు పదవ తరగతి పరీక్షల్లో తొలిసారిగా ఐదు నిమిషాల వెసులుబాటు ఇవ్వనున్నారు. పదవ తరగతి పరీక్షలకు ఐదు నిమిషాల లోపు ఆలస్యం అయినా అనుమతిస్తారు.