రాష్ట్రీయం

ఒడిషాలో ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య సంస్థ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: ప్రముఖ ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ భువనేశ్వర్ కేంద్రంగా ఛన్రాయ్ ప్రాంగణంలో ఆదివారం న్యూ బోర్న్ ఐ హెల్త్ అలియాన్స్ (నేహో) ప్రారంభించింది. ఒడిషాలో నవజాత శిశువుల నేత్ర సంరక్షణకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఎల్‌వి ప్రసాద్ నేత్ర సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకేచోట రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యురిటీ (ఆర్వోపి), పిడియాట్రిక్ రెటినల్ ఇమేజింగ్, నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ వసతులు ఉన్న ఏకైక కేంద్రంగా దీనిని ఏర్పా టు చేసినట్లు తెలిపింది. భారతదేశంలో పుట్టిన ఒకటి రెండు నెలల్లోనే నవజాత శిశువుల్లో ఒక మినియన్ మంది అంధులవుతున్నారని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బాల అంథత్వాన్ని నివారించేందుకు ప్రత్యేక వసతులతో కూడిన ఈ విభాగాన్ని నిపుణుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.