రాష్ట్రీయం

వృద్ధిరేటుపై గొప్పలెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 7: ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రహబలం ఏమిటో తెలియటంలేదు కానీ.. చేపలకు కూడా ధరలు పెరగటంలేదని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది. దీనిపై చర్చించేందుకు ముందుగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్షనేతకు 50 నిమిషాలు కేటాయించారు. జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రగతి నివేదికలు తప్పుల తడకగా అభివర్ణించారు. ఆక్వాకల్చర్‌కు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఓ రకమైన వృద్ధిరేటు ఉంటే ఏపిలో మాత్రం 11 శాతం చూపారంటూ, గత మూడేళ్లుగా వ్యవసాయం కుదేలైందని ఆరోపించారు. రాష్ట్రంలో 24.63 లక్షల ఎకరాల రబీ సాగుకు గాను ఈ ఏడాది 19.56లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారన్నారు. 2016 ఖరీఫ్ సీజన్‌కు 10లక్షల హెక్టార్లలో పంటలు ఎండిపోయాయన్నారు. వాస్తవ పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రెయిన్‌గన్స్‌తో నాలుగురోజుల్లో కరవును పారదోలామని ప్రచారం చేసుకోవటం దౌర్భాగ్యమన్నారు. రెయిన్‌గన్స్ కొనేందుకు 160 కోట్లు ఖర్చయితే నిర్వహణకు 103 కోట్లు వెచ్చించారని, దీనివల్ల ఎకరం కూడా సాగులోకి రాలేదన్నారు. అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. కరవు పరిస్థితుల్లో రుణాల రీషెడ్యూల్ చేయాలి..కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థికసాయంతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి..అయితే ప్రభుత్వం గత మూడేళ్లుగా పంపిణీ చేస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. తీరప్రాంతాల్లో ఫార్మా కంపెనీల రాకతో హేచరీలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. గత రెండున్నరేళ్లుగా రైతులు తీసుకున్న రుణాలు లక్షా 3వేల కోట్లకు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో రుణవిముక్తులు ఎలా అవుతారని ప్రశ్నించారు. గత రెండేళ్లలో 17లక్షల కోట్ల మేర ఎంఒయులు కుదుర్చుకున్నామంటూ ప్రభుత్వం అసత్య ప్రకటనలు చేస్తోందని ధ్వజమెత్తారు. సోషియో ఎకనమిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 4138 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయన్నారు. కేంద్ర వాణిజ్యమంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం గతేడాది డిసెంబర్ నెలాఖరుకు 11వేల 395కోట్ల మేర దరఖాస్తులు రిజిస్టర్ అయ్యాయని వివరించారు. ప్రభుత్వం చెప్తున్న పరిశ్రమలు ఏరకంగా గ్రౌండ్ అయ్యాయో వివరించాలని డిమాండ్ చేశారు. ఉపాధికల్పనలో 2015లో దేశం మొత్తంగా కొత్తగా లక్షా 35వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని చెప్తుంటే రాష్ట్రంలోనే 3లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. ఐటి రంగం హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైందని, ముఖ్యమంత్రి తెగపొగిడే సత్య నాదెళ్ల సైతం మైక్రోసాఫ్ట్ కంపెనీ 11వ శాఖను ఏపిలో ఏర్పాటుచేయబోమని తేల్చిచెప్పారని గుర్తుచేశారు. ట్రంప్ పేరు చెబితే ఎలా భయపడుతున్నారో విదేశీ కంపెనీలు బాబును చూసి వెనక్కు తగ్గుతున్నాయన్నారు. ఇందుకు అవినీతే కారణమన్నారు. సేవలరంగంలో 46శాతం, పరిశ్రమలలో 23, వ్యవసాయంలో 30శాతం వృద్ధిరేటు ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా భారీగా వృద్ధిరేటు చూపిస్తే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఫర్వాలేదనే నిర్ణయానికి వచ్చిందన్నారు. జిఎస్‌డిపి పెరిగితే రెవిన్యూ వృద్ధిరేటు ఎందుకు తగ్గుతుందని ప్రశ్నించారు.