రాష్ట్రీయం

మీ లెక్కలు తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 7: శాసనసభ సమావేశాల రెండోరోజు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రసంగాన్ని మంత్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యతా రంగాలు కుదేలై ఉంటే ప్రభుత్వం రెండంకెల వృద్ధిరేటు పేరుతో ప్రజలను మోసం చేస్తోందని జగన్ మండిపడ్డారు. దీంతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుంటూ ‘మీకు అవగాహనలేదు.. మీ ట్యూటర్ మారినట్లున్నారు..ఎవరో చెప్పింది విని సభను పక్కదారి పట్టిస్తున్నార’ని ఎదురుదాడికి దిగారు. వృద్ధిరేటు బాగానే ఉందని ఒప్పు కుంటూ ఏవో తప్పుడు లెక్కలు చదువుతున్నారని విమర్శించారు. శాసనసభ తాత్కాలికం కాదని వివరణ ఇస్తూ వైసిపీయే తాత్కాలికమని ఛలోక్తి విసిరారు. వృద్ధిరేటు, జిఎస్‌డిపి గురించి పూర్తిగా మరోసారి వివరిస్తామన్నారు. పరిశ్రమల గురించి చర్చిస్తూ తునిలో హేచరీస్ అధికంగా ఉన్నాయని, ఆ ప్రాంతంలో ఫార్మాకంపెనీ నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నారని, దీనివల్ల మత్స్యకారుల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని జగన్ అన్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందిస్తూ పరిశ్రమలు, పెట్టుబడులను అడ్డుకుంటున్నది మీరుకాదా అని ప్రశ్నించారు. జగన్ స్పందిస్తూ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే బాగుంటుందని సలహా ఇస్తూ సముద్ర తీర ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపిస్తే ఇలాగే ఉంటుందని బదులిచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలో భాగంగా పట్టిసీమ ప్రాజెక్టు నుంచి 55 టిఎంసిల నీటిని ప్రకాశం బ్యారేజీ వరకు తీసుకొచ్చేది సముద్రంలో కలిపేందుకా అని ప్రశ్నించారు. దీనిపై జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ పట్టిసీమ ద్వారా గత ఏడాది కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, కారంచేడు ప్రాంతాల్లో ఐదులక్షల ఎకరాల పంటను కాపాడగలిగామన్నారు. వరదలు సంభవించినప్పుడు మిగులు జలాలను సముద్రంలో కలుపుతారనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.