రాష్ట్రీయం

ఇక ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గ్రామపంచాయతికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ఇనె్స్పక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. ఇక నుంచి ఫిర్యాదు దారులు పోలీసు స్టేషన్‌కు వచ్చే బదులుగా ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన వివరించారు. ‘సైబర్ క్రైం అండ్ సోషల్ మీడియా’పై జరిగిన శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఐజి హరీష్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోందని, దీనికి అనుగుణంగానే పోలిసింగ్ వ్యవస్థలో పెను మార్పులు తెస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ శిక్షణ శిబిరంలో 282 మంది పోలీసు అధికారులు శిక్షణ పొందారన్నారు. ఆన్‌లైన్ ఫిర్యాదుల ద్వారా సమస్యల పరిష్కారం సులువుగా, కేసు దర్యాప్తు వేగవంతమవుతుందన్నారు. ఏటిఎం తరహలోనే ఒక క్లిక్‌తో ఫిర్యాదుల దర్యాప్తులను తెలుసుకోవచ్చని ఉదహరించారు. సైబర్ నేరాల అదుపునకు ఐటి టెక్నాలజీ దోహద పడుతుందని, సైబర్ క్రైం విభాగం, సిఐడి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన అధికారులను ఆయన అభినందించారు.

రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల రగడ
టిడిపి నేతల ప్రయోజనాలకే
క్రమబద్ధీకరణ: వైకాపా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 7: ఆంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించే విధంగా చట్టానికి సవరణలు తీసుకురావాలన్న ప్రభుత్వ ఆలోచన వెనక కుట్ర దాగి ఉందని వైకాపా తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తింది. దీని వల్ల టిడిపి నేతలకు ప్రయోజనం చేకూరుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి అన్నారు. గురువారం వారు విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, దళితులు సాగుచేసుకునే అసైన్డ్ భూములపై టిడిపి ప్రభుత్వం కన్నుపడిందన్నారు. అసైన్డ్ భూములు అమ్ముకునే అవకాశాన్ని కల్పించడం సరికాదన్నరు. దీని వల్ల టిడిపి నాయకులు దళితుల అసైన్డ్ భూములను లాక్కొనే అవకాశం ఉందన్నారు. అనైతిక పద్ధతుల ద్వారా ఇప్పటికే రైతుల నుంచి టిడిపి నేతలు భూములు కొనుగోలు చేశారన్నారు. అమరావతి ప్రాంతంలో సారవంతమైన భూములున్నాయన్నారు. దళితులు తమ భూములను అమ్ముకునే పరిస్ధితి కల్పించడం వల్ల సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందన్నారు. రాజధాని ప్రాంతంలో దాదాపు 1800 ఎకరాల అసైన్డ్ భూములను టిడిపి నేతలు చేజిక్కించుకోవాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా తమకు అవసరమైన అసైన్డ్ భూములు, వాటి వివరాలను వెల్లడించాలన్నారు. బలహీనులను మోసం చేసేందుకు చట్టానికి సవరణలు తెస్తే తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.