రాష్ట్రీయం

ఎన్నికలు ఇప్పుడు జరిగినా జయం మనదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9:‘అనేక రకాల సర్వేలు చేయించాను. వచ్చే ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించబోతున్నట్టు అన్ని సర్వేలూ తేల్చిచెప్పాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 101 నుంచి 106 సీట్లలో విజయం సాధించబోతున్నట్టు తేలింది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో అన్నారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశం గురువారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఎంపిలు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం ఏ విధంగా పని చేస్తోంది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనే అంశాలపై వివిధ సర్వేలు నిర్వహించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. 101 నుంచి 106 సీట్లలో విజయం సాధించబోతున్నట్టు తేలిందన్నారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, నారాయణ ఖేడ్, పాలెం నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగినప్పుడు కూడా అప్పటి సర్వేలు నిజమైన విషయాన్ని కెసిఆర్ గుర్తుచేశారు. జిల్లాలవారీగా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి వారి పనితీరుపై సర్వేల్లో తేలిన అంశాలను వివరించారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగు పరుచుకోవాలని, లేకపోతే వారిని తప్పించాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల పనితీరుపై ఐదు నెలల క్రితం ఒకసారి, ఇటీవల మరోసారి సర్వే చేయించినట్టు చెప్పారు. మూడు నాలుగు నెలల తరువాత మరోసారి సర్వే చేయించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి 19.5శాతంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
శాసన సభ, శాసన మండలి సమావేశాలకు సభ్యులందరూ హాజరు కావాలని, హుందాగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ప్రతిపాదించాలని ముఖ్యమంత్రి సూచించారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలని శాసన సభ్యులకు కెసిఆర్ తెలిపారు. సభ్యత్వం నమోదులో ఎమ్మెల్యేలు చురుగ్గా ఉండాలని సూచించారు.

చిత్రం.. గురువారం జరిగిన టిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశంలో మాట్లాడుతున్న కెసిఆర్