రాష్ట్రీయం

ఆ మూడు కేసులను 17వరకు విచారించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ నమోదుచేసిన మూడు కేసులకు సంబంధించి అభియోగాలపై విచారణ జరపవద్దని హైకోర్టు సిబిఐ కోర్టును ఆదేశించింది. ఈ ఆదేశాలు మార్చి 17వ తేదీ వరకు అమలులో ఉంటాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సీతారామమూర్తి పేర్కొన్నారు. తమపై దాఖలుచేసిన అన్ని కేసులను కలిపి ఉమ్మడిగా విచారించాల్సిందిగా జగతి పబ్లికేషన్స్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. ఈ కేసులో సిబిఐ తరఫున న్యాయవాది కేశవరావు వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
మహేశ్ బాబుకు సమన్లపై స్టే పొడిగింపు
శ్రీమంతుడు సినిమా కాపీ రైట్స్ వివాదానికి సంబంధించి దాఖలైన కేసులో దిగువ కోర్టు జారీ చేసిన సమన్లపై మంజూరు చేసిన స్టే కాలపరిమితిని నెల రోజుల పాటు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మహేశ్ బాబు, కొరటాల శివ దిగువ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. ఈ విషయమై వీరు హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం ఈ కేసు విచారణను మార్చి 27కి హైకోర్టు వాయిదా వేసింది.