రాష్ట్రీయం

రెండు రాష్ట్రాల పోలీసుల సంయుక్త కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 9: తెలంగాణ-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని మన్యం కేంద్రం భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నం గగనతలంపై రెండు హెలీకాప్టర్లు సుమారు అరగంట సేపు చక్కర్లు కొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల నుంచి 25 మంది పోలీసు అధికారులు భద్రాచలం చేరుకుని ఇక్కడి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. రెండు రాష్ట్రాల సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం అత్యంత రహస్యంగా నిర్వహించారు. గడిచిన వారం రోజులుగా భద్రాచలం సరిహద్దున మావోయిస్టులు ప్రజలను సమీకరించి సమావేశాలు నిర్వహించడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా మావోయిస్టు కమాండర్లు గిరిజన మహిళలతో కలిసి దండకారణ్యంలో ర్యాలీ, ప్రదర్శన చేయడంతో మావోయిస్టుల దూకుడుకు కళ్లెం వేసేందుకు జాయింట్ ఆపరేషన్లు నిర్వహించేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు కార్యాచరణ రూపొందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.