రాష్ట్రీయం

215 నుండి 70 కిలోలకు ‘పండరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 9: దక్షిణ భారతంలోనే బేరియాట్రిక్ సర్జరీలకు కేరాఫ్‌గా విజయవాడ మారుతోంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో స్థూలకాయులు విజయవాడకు వచ్చి బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకుని తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యాన్ని పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌కు చెందిన ఆర్టీసీ చిరుద్యోగి పండరీనాథ్ సరిగ్గా రెండేళ్ల క్రితం 215 కేజీల స్థూలకాయంతో అపస్మారక స్థితిలో ప్రాణాపాయ దశలో విజయవాడ వచ్చాడు. సూర్యారావుపేటలోని ఎండోకేర్ హాస్పిటల్స్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ కొంగర రవికాంత్ అన్ని వైద్య పరీక్షలు చేసారు. అప్పటికే పండరీకి గురక, ఆయాసం, కాళ్లవాపులు, విపరీతమైన అలసట, శరీరమంతా వాపు వంటి లక్షణాలతో రాగా డాక్టర్ రవికాంత్ నీరు తగ్గించే మందుల ద్వారా 10 కిలోల బరువు తగ్గించి 205 కేజీల బరువులో బేరియాట్రిక్ సర్జరీని విజయవంతంగా చేసారు. తరువాత క్రమంగా శరీరంలో కొవ్వు శాతం తగ్గించటంతో 120 కిలోల బరువు తగ్గి 95 కేజీలకు చేరాడు. రూ.2.5 లక్షల ఖర్చుతో కూడిన రెండో ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేని స్థితిలో డాక్టర్ రవికాంత్‌ను అభ్యర్థించగా మానవతా దృక్పథంతో ఈనెల 1వ తేదీన ‘అబ్డామిన్ ప్లాస్టీ’ శస్తచ్రికిత్సను ఉచితంగా విజయవంతంగా పూర్తిచేసి, 70 కేజీల బరువుకు పండరీని తీసుకువచ్చారు. ప్రస్తుతం పండరీ బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తన ప్రాణాలు కాపాడడంతోపాటుగా పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ రవికాంత్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, తాను పుట్టిన గడ్డ తెలంగాణ అయినా మరుజన్మ ఇచ్చినది ఆంధ్రా వాళ్లేనని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఈ సందర్భంగా ఎండోకేర్ ఆస్పత్రిలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో డాక్టర్ కొంగర రవికాంత్ మాట్లాడుతూ బేరియాట్రిక్ సర్జరీల్లో 99.9 శాతం సక్సెస్ రేటు సాధిస్తున్నామని, ఇప్పటికే అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఇరాక్, బహ్రయిన్, ఖతార్, సౌదీ అరేబియా, దుబాయ్ దేశాల నుంచి అనేక మంది ఆస్పత్రికి వచ్చి బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్నారన్నారు. బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్న వారంతా బరువు తగ్గిన తర్వాత వేలాడే చర్మం గురించి బెంగపడనవసరం లేదని, ఆధునిక పద్ధతుల్లో తొలగించే ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయన్నారు.

చిత్రాలు..చికిత్సకు ముందు, తరువాత పండరి