రాష్ట్రీయం

ఏపీయే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 10: రాష్ట్రంలో చేపట్టాల్సిన పరిపాలనా సంస్కరణలపై చర్చ జరగాల్సి ఉందని, ఈ మేరకు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో ఈ ఏడాది తలసరి ఆదాయం 1,22,376 రూపాయలు కాగా దేశ తలసరి ఆదాయం 1,03,818 రూపాయలన్నారు. వెలగపూడి సచివాలయం లో కార్యదర్శులు, విభాగాధిపతులు, మంత్రులతో శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలూ సమన్వయంతో పని చేస్తేనే అనుకున్న ఫలితాలను రాబట్టగలమన్నారు. రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి సంస్కరణల రూపకల్పనకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమల రంగం అభివృద్ధిపైనే సేవల రంగం వృద్ధి ఆధారపడి ఉందన్నారు. సేవల రంగం వృద్ధి కోసం త్వరలో కార్యదర్శులతో అధ్యయన కమిటీని నియమిస్తానని తెలిపారు. ముందస్తు అంచనాల ప్రకారం 2016-17 సంవత్సరానికి సంబంధించి 11.61 శాతం వృద్ధి రేటు సాధించడంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరవు పరిస్థితులు నెలకొన్నా, రెండంకెల వృద్ధి రేటు కొనసాగించగలిగామన్నారు. వ్యవసాయం, అనుబంధ సంఘాల్లో వృద్ధి రేటు 14.03 శాతం ఉండగా, పరిశ్రమల రంగంలో 10.05 శాతం, సేవల రంగంలో 10.16 శాతం వృద్ధిని రాష్ట్రం నమోదు చేసిందన్నారు. ఈ ఫలితాలతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి 15 శాతం వృద్ధి రేటు నమోదు చేద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలంటే అవిశ్రాంతంగా పని చేయక తప్పదన్నారు.
పరీక్షా సమయం
ప్రతి త్రైమాసికంలో వెలువడే ఆర్థిక ఫలితాలు తనకు పరీక్షా సమయమని సిఎం చెప్పారు. రాష్ట్ర వృద్ధి రేటు ఏ మేరకు ఉంటుంది.. ఇంకా ఎలా అభివృద్ధి చేయచ్చు అని నిరంతరం ఆలోచిస్తుంటానన్నారు. ఆక్వా రంగానికి నిధులు తక్కువ కేటాయించినా, 30.09 శాతం వృద్ధి సాధ్యమైందని, ఇది ఇతర రంగాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. తలసరి ఆదాయంలో దేశ సగటును మించి రాష్ట్రం దూసుకుపోతోందన్నారు.

చిత్రం..మంత్రులు, విభాగాధిపతులు, ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు