రాష్ట్రీయం

కొలువుల జాతరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా హామీఇచ్చిన మేరకు లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. ఐదేళ్ల వ్యవధిలో నియమించే లక్ష ఉద్యోగాలలో ఇప్పటికే 27,481 భర్తీ చేశామన్నారు. త్వరలో మరో 12 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు, 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల, 24 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించనున్నామని ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి (2017-18) ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన 33 నెలలలో వివిధ రంగాలలో సాధించిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. నూతన రాష్టమ్రైన తెలంగాణ శీఘ్రంగా అభివృద్ధి సాధిస్తూ కేవలం 33 నెలల వ్యవధిలోనే అనేక క్రియాత్మక, వినూత్న చర్యల ద్వారా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. ప్రభుత్వం రాజకీయ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక, సుపరిపాలన అందిస్తుందని, రాష్ట్రం ఏర్పడ్డాక తాను చేసిన తొలి ప్రసంగంలో ఇచ్చిన హామీని అక్షరాల నిలబెట్టుకోగలిగిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు తీసుకెళ్లి ‘బంగారు తెలంగాణ’ సాధించే దిశగా చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. వచ్చే ఏదేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాటకు కట్టుబడి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 27,481 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఇందులో పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా 5,936 ఉద్యోగాలు, సింగరేణిలో 4500 ఉద్యోగాలు, విద్యుత్ సంస్థలలో 2,681 ఉద్యోగాలు, పోలీస్ శాఖలో 10,442 ఉద్యోగాలు, ఆర్టీసీలో 3950 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. త్వరలో మరో 12 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు చెప్పారు. అలాగే 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యుత్ రంగంలోని 24 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించనున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడంలో భాగంగా నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. పెండింగ్‌లో ఉన్న 23 భారీ, 13 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురైన అడ్డంకులను అధిగమించామన్నారు. ఇప్పటికే 7 ప్రాజెక్టులు పూర్తికాగా, 14 ప్రాజెక్టులు పాక్షికంగా ప్రారంభమయ్యాయని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొన్న విద్యుత్ కొరత, కోత నుంచి పూర్తిగా విముక్తి కల్పించగలిగామన్నారు. పగటి పూట వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్ది ‘పవర్ ఎవ్రీ డే, ఎనీ టైమ్ పవర్’ సాధించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో చెప్పుకోదగిన విజయం సాధించామన్నారు. వచ్చే మూడేళ్లలో 16,306 మెగావాట్ల విద్యుదుత్పత్తి అందుబాటులోకి తెచ్చేలా పని చేస్తుందన్నారు.
తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) పెరుగుదలలో గణనీయమైన వృద్ధి సాధించిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధిరేటు 11.5 శాతం నమోదు కాగా, రాష్ట్రంలో వృద్ధిరేటు 13.7 శాతానికి చేరుకుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించే బృహత్తర మిషన్ భగీరథ పథకాన్ని ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా 17,278 చెరువుల పునరుద్ధరణ చేపట్టామన్నారు. బడ్జెట్‌లో సింహభాగం నిధులను సంక్షేమ రంగానికి కేటాయిస్తున్నామన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 35 వేల కోట్లు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గవర్నర్ వివరించారు.

చిత్రం..ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్.
చిత్రంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి