రాష్ట్రీయం

గ్యాస్, వౌలిక సదుపాయాల రంగానికి పెట్టుబడుల ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: వచ్చే రెండేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ రంగంలో వౌలిక సదుపాయాలు, ఉత్పత్తి, పంపిణీకి సంబంధించి భారీ ఎత్తున రూ.64,195 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2016,2017 సంవత్సరాల్లో గ్యాస్ రంగంలో రూ. 1850 కోట్లు, పోర్టుల్లో రూ. 4443 కోట్లు, విమానాశ్రయాల్లో రూ.3359 కోట్లు, సామాజిక వౌలిక సదుపాయాల్లో రూ. 590 కోట్లు, ఫైబర్ గ్రిడ్‌లో రూ.333 కోట్లు, బీచ్ కారిడార్‌లో రూ. 300 కోట్లు, సిఆర్‌డిఏ పరిధిలో రూ. 5860 కోట్లు పెట్టుబడులు రానున్నాయి. 2016లో మొత్తం రూ. 27,265 కోట్లు, 2017లో రూ. 36,930 కోట్లు పెట్టుబడులు వస్తాయి. విద్యుత్ రంగంలో 2016లో 22,600 కోట్లు, 2016లో 24,800 కోట్ల పెట్టుబడులు ఖరారవుతాయని చెప్పారు.
కృష్ణపట్నం, కాకినాడలో మెసర్ కాంకర్, రైల్వేలు కలిపి లాజిస్టిక్ పార్కులు, కృష్ణపట్నంలో మెసర్ రీగన్ ఇన్‌ఫ్రా ఇండియా ఎల్‌ఎన్‌జి టర్మినల్, తూర్పు, పశ్చిమగోదావరి,కృష్ణా జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును, ఇంకా సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్ధ ఆధ్వర్యంలో ఎన్టీపిసి సౌర విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. జాతీయ పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో వౌలిక సదుపాయాలు, గ్యాస్, విద్యుత్ రంగాలకు సంబంధించి ఎంఓయూలు ఖరారు కానున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నివేదిక సమర్పించారు. దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల విలువ చేసే అవగాహన ఒప్పందాలను ఖరారవనున్నట్లు చెప్పారు.
అందరికీ విద్యుత్ స్కీంను చిత్తశుద్ధికి అమలుపరుస్తామని, రాష్ట్రంలో విద్యుత్‌కోతలు లేవని, మిగులు విద్యుత్‌దిశగా ఆంధ్ర రాష్ట్రం పయనిస్తోందని అజయ్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు వంద శాతం అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. సిస్టమ్ ఏవరేజ్ ఇంటరప్షన్ ఫ్రీక్వెన్సీ ఇండెక్స్, సిస్టమ్ ఏవరేజ్ ఇంటరప్షన్ డ్యురేషన్ ఇండెక్స్ ద్వారా విద్యుత్ సరఫరాను పర్యవేక్షించే అత్యంత ఆధునిక వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నామన్నారు.