రాష్ట్రీయం

నేతన్నల కన్నీళ్లు తుడుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/దుబ్బాక, మార్చి 10: చేనేత కార్మికుల కన్నీళ్లు తుడిచి ఆ కుటుంబాలు ఆనందంగా బతికేలా చూద్దామని రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి సమంత అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చేనేత సొసైటీలు, దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని సమంత సందర్శించి సందడి చేశారు. సిద్దిపేట వీరారెడ్డిపల్లి సొసైటీ, ఆదర్శ సొసైటీలో గొల్లభామ చీరలను ఆసక్తిగా పరిశీలించారు.
చేనేత పరిశ్రమ, కార్మికుల పట్ల అవగాహన పెంపొందించుకునేందుకే రాష్ట్రంలోని చేనేత సొసైటీలను సందర్శిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గొల్లభామ చీరలను కొనుగోలు చేసి తీసుకపోయారు. అలాగే ఆదర్శ సొసైటిలో గొల్లభామ చీరలు, షర్టింగ్‌లను పరిశీలించి కొనుగోలు చేశా రు. సుమారు అర్దగంటకు పైగా ఆమె సొసైటీలో కార్మికులతో ముచ్చటించి వారితో కలసి ఫొటోలు దిగారు.
గొల్లభామ చీరలు ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ పెంపుకు కృషి చేస్తానన్నారు. దుబ్బాక చేనేత సొసైటీలో మగ్గాలపై కార్మికులు నేస్తున్న వస్త్రాలను ఆసక్తిగా తిలకించారు. మహిళలు రాట్నంపై దారం కండెలు చుట్టడం చూసి వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఇక్కడ నేసిన టవల్స్, లెనిన్ షర్టింగ్స్ చాలా బాగున్నాయని, వాటిని శాంపిల్స్‌గా తీసుకెళ్లి మార్కెట్‌లో మంచి ధర లభించేలా చూస్తానన్నా రు. ఈ సందర్భంగా విలే ఖరులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమంత సమా ధానమిచ్చారు. చేనేత వస్త్రాలకు పూర్వవైభవం తీసుకొచ్చి కార్మికుల బతుకులు బాగు చేయాలన్న లక్ష్యంతోనే తాను పర్యటనలు జరుపుతు న్నానన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పడం, ఈక్రమంలో సమంత ఇక్కడికి రావడంతో కార్మి కులు సంబ రపడుతున్నారు. నేత కార్మికుల సంక్షే మం కోసం చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిమగ్నమైందని వారు భావిస్తున్నారు.

చిత్రం..చేనేత వస్త్రాలను పరిశీలిస్తున్న సినీనటి సమంత