రాష్ట్రీయం

ఫిబ్రవరి 18న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్టీసి)లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఫిబ్రవరి 18న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్మిక శాఖ అదనపు కమిషనర్ సూర్యప్రసాద్ సమక్షంలో గురువారం జరిగిన రెండోవిడత ఆర్టీసి కార్మిక సంఘాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఫిబ్రవరి 18న జరుగుతాయని ఎపిఎస్‌ఆర్టీసి ఎండి సాంబశివరావు చెప్పారు.
ఈ మేరకు కార్మిక శాఖ అదనపు కమిషనర్ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. కాగా కార్మిక శాఖ అదనపు కమిషనర్‌తో జరిగిన సమావేశంలో 12 కార్మిక సంఘాలు పాల్గొన్నా. కార్మిక సంఘాల సమాచారం మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను ఈ రకంగా ఖరారైంది. జనవరి 29న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల, ఫిబ్రవరి 2న అభ్యంతరాల స్వీకరణ, ఫిబ్రవరి 5న ఓటర్ల తుదిజాబితా వెల్లడి, ఫిబ్రవరి 9న కార్మిక సంఘాలకు ఓటర్ల జాబితా అందజేత, అనంతరం 18వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సారి ఎన్నికలు రెండేళ్లకు పరిమితమయ్యే జరుగుతాయని, నాలుగేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలన్న కొన్ని కార్మిక సంఘాల డిమాండ్ పరిశీలనలో ఉందని ఎండి తేల్చి చెప్పారు.