రాష్ట్రీయం

తెలంగాణ డిమాండ్‌ను సమర్థించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సరుూద్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నేటిదాకా రాజకీయంగా తమకు ఎంతో అండగా నిలిచిన ముఫ్తీ మహ్మద్ సరుూద్ లేని లోటు వ్యక్తిగతంగా పూడ్చలేనిదని ముఖ్యమంత్రి కెసిఆర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ముఫ్తీ మహ్మద్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ డిమాండ్‌కు దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్న సమయంలో ముఫ్తీ మహ్మద్ సరుూద్ గట్టిగా సమర్థించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమ సభకు ఆయన తన కూతురు మహబాబా ముఫ్తీని పంపించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ముఫ్తీ మహ్మద్ సరుూద్ అంత్యక్రియలకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని, తెలంగాణ రాష్ట్రం తరఫున ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని పంపించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.