రాష్ట్రీయం

ప్రధాన నిందితుడిని గుర్తించిన సిఐడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ ఎమ్సెట్-2 కేసు దర్యాప్తు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ కేసులో గుర్గావ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నాపత్రం బయటకు తెచ్చిన కీలక నిందితుడిని సిఐడి పోలీసులు గుర్తించారు. వారణాసికి చెందిన ఎస్ బహదూర్ సింగ్ ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రాన్ని ప్రింటింగ్ ప్రెస్ నుంచి స్వయంగా బయటకు తెచ్చాడని సిఐడి పోలీసులు తెలిపారు. ప్రింటింగ్ ప్రెస్‌లో ఉద్యోగికి రూ.10 లక్షలు చెల్లించి ఈ ప్రశ్నాపత్రాన్ని తెచ్చాడు. ఇప్పటికే ఈ కేసులో బహదూర్ సింగ్‌ను పట్టుకునేందుకు వారణాసి, ఢిల్లీకి సిఐడి పోలీసులు బయలుదేరి వెళ్లారు. ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రశ్నాపత్రాన్ని బహదూర్ సింగ్‌కు ఇచ్చిన ఉద్యోగి వివరాలు కూడా కనుక్కుంటున్నామని సిఐడి వర్గాలు తెలిపాయి. ఈ కేసులో వీరిద్దరిని అరెస్టు చేస్తే కేసు దర్యాప్తు దాదాపు ముగిసినట్లేనని సిఐడి పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు నమోదై పది నెలలు కావస్తున్నా ఇంకా చార్జిషీటు దాఖలు చేయకపోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగానే ఈ కేసుపై సిఐడి చార్జిషీటు దాఖలు చేసేందుకు అవసరమైన కసరత్తును ప్రారంభించింది.