రాష్ట్రీయం

పుట్టింది తెలంగాణ.. అయినా స్థానికేతరులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: సమైక్య రాష్ట్రంలో ఎపిలో పనిచేసిన తెలంగాణ ఉద్యోగుల పిల్లలు ‘స్థానికత’ విషయంలో విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
తెలంగాణకు చెందిన అనేక మంది గెజిటెడ్, గ్రూప్-1 అధికారులు ఉద్యోగరీత్యా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పది నుండి పాతిక సంవత్సరాల పాటు పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత వారు తెలంగాణకు తిరిగి వచ్చారు. ఈ ఉద్యోగుల పిల్లల్లో చాలా మంది పాఠశాల స్థాయిలో ఎపిలోని పాఠశాలల్లో చదువుకున్నారు. ఇప్పుడు ఈ పిల్లలంతా స్థానికత (లోకల్) విషయంలో ఎపికి లోకల్ అవుతున్నారు. తల్లిదండ్రులు తెలంగాణ లోకల్‌గా ఉండగా, వారి పిల్లలు ఎపికి లోకల్ అవుతున్నారు. విద్య, ఉద్యోగాల్లో ఇప్పుడు ఈ పిల్లలు తెలంగాణకు ‘నాన్-లోకల్’గా మారిపోయి విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తమ పిల్లలకు ఏదో ఒక రకంగా న్యాయం చేయాలంటూ ఈ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వానికి, మరీముఖ్యంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కోరుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతి హోదాల్లో పనిచేస్తున్న ఎపి ఉద్యోగులను గత రెండేళ్ల నుండి ఎపికి బదిలీ చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద తీసుకుని, ఈ ఉద్యోగుల పిల్లలను ఎపిలో లోకల్ చేసేందుకు కేంద్రం వద్ద ప్రయత్నించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.
అలాగే కెసిఆర్ కూడా శ్రద్ద తీసుకుంటే తమకు, తమ పిల్లలకు న్యాయం జరుగుతుందని ఎపిలో పనిచేసిన తెలంగాణకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు చెప్పారు.