రాష్ట్రీయం

రామయ్య పెళ్లికొడుకాయనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి పెళ్లి పనులు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. హోలీ పర్వదిన సందర్భంగా ఆదివారం రామయ్యను పెళ్లికొడుకును చేసి, వసంతోత్సవం నిర్వహించారు. పెళ్లి తలంబ్రాలు, పసుపు కొట్టే పనులు ప్రారంభించారు. ఆర్డీవో శివనారాయణరెడ్డి, దేవస్థానం ఇవో తాళ్లూరి రమేశాబాబు ఆధ్వర్యంలో భక్తులు తలంబ్రాల బియ్యం కలిపారు. అత్తరు, పసుపు, కుంకుమలు కలిపారు. ఈసందర్భంగా రోటిలో పసుపుకొమ్ములు వేసి పసుపు కొట్టారు. చిత్రకూట మండపంలో జరిగిన ఈ వేడుక వైభవంగా సాగింది. అనంతరం ఆలయంలోని ప్రాకార మండపంలో స్వామికి వసంతోత్సవం కన్నులపండువగా చేశారు. సీతారామచంద్రులు వసంతమాడారు. బంగారు ఊయలలో సీరతారామచంద్రులను ఉంచి డోలోత్సవం జరిపారు. పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ వేడుకను తిలకించి పులకించారు.

చిత్రం..తలంబ్రాలు కలుపుతున్న భక్తులు