రాష్ట్రీయం

భూమాకు వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు/నంద్యాల, మార్చి 13: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు సోమవారం అంతిమ వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో భూమా అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆళ్లగడ్డలోని భూమా స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆళ్ళగడ్డ, నంద్యాల నియోజకవర్గాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు, అభిమానులు తమ నేతను కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధ్యాహ్నం ఆళ్లగడ్డ చేరుకున్నారు. ఇంటివద్ద ఉన్న భూమా పార్దివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, నారా లోకేష్, ఇన్‌చార్జి మంత్రి అచ్చెనాయుడు, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్, పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చారు. కాంగ్రెస్ నేత కోట్ల సుజాతమ్మ, పలువురు కాంగ్రెస్ నాయకులు భూమా నాగిరెడ్డికి నివాళులర్పించారు. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజాసమస్యలు తీర్చే నాయకుడు ఇకలేరని వారు ఆవేదన చెందారు. భూమా నాగిరెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ఆళ్ళగడ్డలో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. ఆళ్లగడ్డలోని స్వగృహం నుండి నాగిరెడ్డి పార్థి దేహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పట్టణ శివారులో ఉన్న శోభాఘాట్‌కు తరలించారు. శోభాఘాట్‌కు చేరుకోగానే పార్థివదేహంపై జాతీయ పతాకాన్ని ఉంచి పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు. అనంతరం చితిపై పార్థివదేహాన్ని ఉంచగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, శాసనసభ్యులు, కుటుంబ సభ్యులు చితి వద్దకు చేరుకొని మరోసారి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భూమానాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాతరెడ్డి చితికి నిప్పంటించారు.
భూమా లేని లోటు తీరనిది
భూమా నాగిరెడ్డితో గత 30 ఏళ్లుగా స్నేహం, అనుబంధం ఉందని అలాంటి నాయకుడిని కోల్పోవడం రాజకీయంగా పార్టీకే కాకుండా ప్రజా నాయకుడిగా ప్రజలకు తీరని లోటని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం ఆళ్ళగడ్డకు వచ్చిన సిఎం భూమా పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ తనను ఏ సందర్భంలో కలిసినా నంద్యాల, ఆళ్ళగడ్డ ప్రజల సమస్యలను వివరిస్తూ వాటి పరిష్కారం కోసం ప్రయత్నించేవారని గుర్తుచేసుకున్నారు. గత శనివారం అనారోగ్యంతో ఉన్నా శాసనమండలి ఎన్నికలపై చర్చించడానికి తన వద్దకు వచ్చిన సమయంలో కూడా నంద్యాల పట్టణంలో రహదారుల విస్తరణ, పేదలకు పక్కాగృహాలు, నంద్యాల, ఆళ్ళగడ్డలో తాగునీటి సమస్యను వివరించి వీలైనంత తొందరగా పరిష్కరించాలని కోరారన్నారు. నలతగా కనిపించిన నాగిరెడ్డిని అదే విషయమై ప్రశ్నించగా గత వారం రోజులుగా ఆరోగ్యం బాగాలేదని కాస్త అలసినట్లుగా ఉందని సమాధానం చెప్పారన్నారు
చిత్రం.. భూమా నాగిరెడ్డి పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు