రాష్ట్రీయం

భళి భళి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: సంప్రదాయ బడ్జెట్‌కు భిన్నంగా వాస్తవిక కోణంలో తెలంగాణ రాష్ట్రానికి అతికినట్టు ఉందని సిఎం కె చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదల సంక్షేమానికి ఉపయోగపడేలా, ఆర్థిక ప్రగతికి దోహదపడేలా ఉందన్నారు.
శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం సిఎం చాంబర్‌కు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ వ్యవస్థ పరిపుష్టికి బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యతనిస్తూ, పూర్తి సమతుల్యతతో బడ్జెట్ రూపొందించారని ప్రశంసించారు. నిరుపేదలు, మహిళలు, చిన్న ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి, కుల వృత్తులను ప్రోత్సాహానికి అత్యధిక నిధులు కేటాయించడం పట్ల సిఎం సంతోషం వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో విస్మరించిన అనేక రంగాలు, వర్గాలకు ఈసారి బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వనరులను సరిగ్గా అంచనావేసి రాష్ట్ర అవసరాలను సరిగా గుర్తించి, మానవ వనరులను సంపూర్ణంగా వినియోగించుకునేలా బడ్జెట్ రూపొందించటం అభినందనీయమన్నారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అత్యంత సమర్థవంతంగా నిర్వహణ, ప్రగతి పద్దులకు నిధులు కేటాయించారన్నారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించి, అభివృద్థి, సంక్షేమానికి ఉపయోగపడే ప్రగతి వ్యయానికి నిధులు ఎక్కువగా కేటాయించడం మంచి పరిణామమన్నారు. బడ్జెట్ రూపకల్పనలో విశేష కృషి చేశారని మంత్రి ఈటల రాజేందర్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్థిక సలహాదారు జిఆర్ రెడ్డిని సిఎం అభినందించారు. ఇలాఉండగా బడ్జెట్‌లో తమకు నిధులు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ యాదవులు, కుర్మ వర్గాలకు చెందిన ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి సిఎంకు మూడు గొర్రెలు, మత్స్యకారులు చేపలను బహూకరించారు. మహిళా ఎమ్మెల్యేలు కలిసి కళ్యాణలక్ష్మికి నిధులు పెంచడంతోపాటు గర్భిణిల ప్రసూతికి ప్రత్యేక నగదు ప్రోత్సాహకం ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.