రాష్ట్రీయం

నేటి నుండి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పోరుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మార్చి 14: సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు పోరుబాట పట్టారు. తెలంగాణ లోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) ఆధ్వర్యంలో బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. 26 డిమాండ్లతో సింగరేణిలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 26 వేలకుపైగా కార్మికులు సమ్మె చేయనుండడంతో కీలక విభాగాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కోల్ ఇండియా తరహాలో వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ సింగరేణిలోని ఎక్స్‌ప్లోరేషన్, ఓపెన్‌కాస్ట్‌లు, భూగర్భ గనులు, సివిల్ కోల్ ట్రాన్స్‌పోర్ట్, సింగరేణి కార్యాలయ నిర్వహణలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, రైల్వే సైడింగ్, గార్డెన్, నర్సరీ, సర్ఫేస్ మైనర్, కంటిన్యూషన్ మైనర్ వంటి విభాగాల్లో పనిచేసే కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు చేయనున్న సమ్మెపై చర్చించేందుకు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) లక్ష్మణ్, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జెఎసి నాయకుల సమక్షంలో మంగళవారం జరిగిన చర్చలకు సింగరేణి యాజమాన్యం తరఫున అధికారులు హాజరుకాలేదు.