రాష్ట్రీయం

భూమాను క్షోభ పెట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 14: నంద్యాల సీటు సాంకేతికంగా తమదేనని, అక్కడ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలిపారు. భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ నాగిరెడ్డి చనిపోయిన విషయం తెలిసిన వెంటనే ఆయన కుమార్తె అఖిలప్రియతో మాట్లాడానని తెలిపారు. చివరిదశలో నాగిరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. పార్టీలోకి వస్తే మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆశ చూపించడం వల్లే భూమా పార్టీ మారారని గుర్తు చేశారు. అదే విషయాన్ని భూమా తమ పార్టీ నేతలకూ చెప్పారని, ఎన్టీఆర్ తరహాలోనే భూమాను మానసిక క్షోభకు గురి చేశారన్నారు. భూమా చనిపోయి 24 గంటలు గడవకముందే అఖిలప్రియను అసెంబ్లీ సమావేశాల్లో కూర్చోబెట్టడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తన క్యారెక్టర్‌కు, చంద్రబాబు క్యారెక్టర్‌కు నక్కకూ, నాగలోగానికీ ఉన్నంత తేడా ఉందన్నారు. పార్టీలు మారే సంస్కృతిని ప్రారంభించింది వైఎస్ కదా.. అని ప్రశ్నించగా, ఆ రోజులు వేరని, ఇప్పుడున్న పరిస్థితులు వేరన్నారు. వైసిపిలోకి కాంగ్రెస్ వారు వస్తే, రాజీనామా చేయించి గెలిపించానని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చినా, ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించబోనని స్పష్టం చేశారు. తన రాజకీయం హీరోలా ఉంటుందని, చంద్రబాబుది విలన్‌లా ఉంటుందన్నారు. హుందాగా వ్యవహరించాలన్న ఆలోచనతోనే తాము సంతాప సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. హాజరై ఉంటే భూమా చేసిన మంచి పనులతోపాటు చివరి రోజుల్లో ఆయన చేసిన తప్పులను కూడా ప్రస్తావించాల్సి వచ్చేదన్నారు. భూమా ఇమేజ్‌కు భంగం కలుగకుండా, అసెంబ్లీ రికార్డుల్లోకి ఆ తప్పులు ఎక్కకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నంద్యాల సీటు సాంకేతికపరంగా తమదేనని తెలిపారు. పోటీ పెట్టకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన వ్యక్తి చనిపోతే, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి పోటీ చేయకుండా ఉండటం సంప్రదాయమన్నారు.