రాష్ట్రీయం

సెగ్మెంట్‌కు వెయ్యి ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: ప్రతి నియోజకవర్గంలో వెయ్యి డబుల్ బెడ్‌రూంల నిర్మాణానికి అవసరమైన, అనువైన స్థలాలు ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే ఎంపిక చేసిన 72,963 గృహాల నిర్మాణానికి టెండర్లు పిలిచారని, వీటికి ఒప్పందాలు పూర్తి చేసుకుని వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఎంపిక చేసిన 82,463 గృహాలను పరిశీలించి నివేదిక సమర్పిస్తే లబ్ధిదారులకు నిధులు చెల్లిస్తామన్నారు. మంగళవారం సచివాలయంలో హరితహారం, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, వేసవిలో మంచి నీటి సరఫరాపై కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత నెల 23న జారీ చేసిన మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలని ఆదేశించారు. గృహా నిర్మాణానికి సంబంధించి జిల్లాల్లో నోడల్ అధికారులను నియమించాలన్నారు. గృహాల మంజురులో బీడి కార్మికులకు ఎంపిక చేయాలని, లబ్ధిదారుల జాబితాలను వెంటనే సమర్పించాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షిస్తారనే విషయాన్ని గుర్తించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం అమలులో సిద్దిపేట, ఖమ్మం, వరంగల్ అర్బన్, సూర్యాపేట, భద్రాద్రి, భూపాలపల్లి కలెక్టర్లను ఆయన అభినందించారు. హరితహారం కార్యక్రమంలో వచ్చే సీజన్‌కు సంబంధించి జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా నర్సరీలలో మొక్కల పెంపకాన్ని వేకవంతం చేయాలని సిఎస్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ నీతు ప్రసాద్, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ పికె ఝూ తదితరులు పాల్గొన్నారు.