రాష్ట్రీయం

అప్పు చేసేది అభివృద్ధి కోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: ఏ రాష్టమ్రైనా అప్పు తీసుకొస్తే దాన్ని అభివృద్ధికి వినియోగిస్తే సత్ఫలితాలు వస్తాయని, అదేవిధంగా తెరాస ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పు అభివృద్ధి పనులకే వినియోగిస్తున్నట్టు రాష్ట్ర పరిశ్రమల మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భూపతిరెడ్డిలతో కలిసి తెరాస ఎల్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మంగళవారం మాట్లాడారు. అప్పులులేకుండా ప్రపంచంలో ఏ దేశంకానీ, మన దేశంలో ఏ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందలేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమ ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులు తక్కువేనన్నారు. గుజరాత్ 65 వేల కోట్ల అప్పు, ఏపీకి 90 వేల కోట్ల అప్పు ఉందని, కర్నాటక 1.63 లక్షల కోట్ల అప్పు ఉందని కెటిఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతోందని, అందుకే తెలంగాణ బాండ్స్ ఇటీవల తాము విడుదల చేస్తే, మదుపరులు ఎగబడి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమానికి, మరోవైపు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్టు కెటిఆర్ వివరించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1.49 లక్షల కోట్ల బడ్జెట్ చూసి కాంగ్రెస్ నేతలకు కళ్లు బైర్లు కమ్మాయన్నారు. ఎస్టీ, ఎస్టీ, బీసీలతో సహా అన్ని వర్గాలకు లబ్దిచేకూరేలా బడ్జెట్ రూపొందించామని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు వీలుగా నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టామని, అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ చేపట్టామని, గ్రామాల్లో కుంటలు, చెరువులను బాగు చేసేందుకు మిషన్ కాకతీయ చేపట్టామన్నారు. కెసిఆర్ నేతృత్వంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన ప్రగతిశీల బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని, సిఎం, ఎఫ్‌ఎంలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు. వాస్తవాలు ఇలాఉండగా, విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను గమనించే గత రెండున్నర ఏళ్ల నుండి జరుగుతున్న అన్ని రకాల ఎన్నికల్లో తమకు అండగా నిలుస్తున్నారని కెటిఆర్ వ్యాఖ్యానించారు.