రాష్ట్రీయం

డిసిఐ చైర్మన్‌తో ఉద్యోగులు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 14: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డిసిఐ) ప్రైవేటుపరం చేయద్దంటూ ఆ సంస్థ ఉద్యోగులు మంగళవారం డిసిఐ చైర్మన్ రాజేష్ త్రిపాఠిని కలిశారు. దీనిపై చైర్మన్ త్రిపాఠి మాట్లాడుతూ డిసిఐ షేర్ల అమ్మకంపై అధికారికంగా తనకు ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. తాను సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరలో సమాచారాన్ని అందిస్తానని చైర్మన్ చెప్పారు.
షేర్ల విక్రయాన్ని నిరసిస్తూ డిసిఐ ఉద్యోగులు నాలుగు రోజులుగా చేస్తున్న నిరసన ప్రదర్శనలను ఇకపై కూడా కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే, ముంబై, ఢిల్లీలోని ఉద్యోగులతో వీరు మంగళవారం సంప్రదింపులు జరిపారు. అక్కడి నుంచి వచ్చిన సమాచారంబట్టి, క్యాబినెట్‌లోని ఒకరిద్దరు మంత్రులు డిసిఐ షేర్లు విక్రయించాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో డిసిఐ షేర్ విలువనుబట్టి 51 శాతం షేర్లను విక్రయిస్తే, 600 నుంచి 700 కోట్ల రూపాయలకు మించి కేంద్రానికి ఆదాయం రాకపోవచ్చని తెలుస్తోంది. లిక్విడ్ క్యాష్ కోసం కేంద్రం ఈ విక్రయానికి పాల్పడుతోందని చెబుతున్నారు.
డిసిఐ ఉద్యోగులు మంగళవారం రాత్రి మరోసారి సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.

చిత్రం..డిసిఐ కార్యాలయ ఆవరణలో భోజన విరామ సమయంలో నిరసన తెలియచేస్తున్న ఉద్యోగులు