రాష్ట్రీయం

రియల్టీతోనే ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 8: రాష్ట్భ్రావృద్ధిలో నిర్మాణ రంగంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం కీలకపాత్ర వహిస్తుందనడంలో సందేహం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అయితే ఈ రంగాల్లో పనిచేసే వ్యక్తులు తాత్కాలిక ప్రయోజనాలకు వెంపర్లాడకుండా విశ్వసనీయతతో కూడిన పనితనం, నిర్వహణ చూపాలని నిర్మాణరంగ, రియల్ ఎస్టేట్ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. కాన్ఫడరేషన్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ‘క్రెడాయ్’ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే ప్రాపర్టీ షోను సిఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. షోలో దేశం నలుమూలల నుంచి వచ్చిన బ్యాంకర్లు, భవన నిర్మాణరంగ కంపెనీలు, ఇంటీరియర్ డెకరేటర్స్ సంస్థలు దాదాపు 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు.
తొలుత సిఎం వీటన్నింటినీ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నేటి పరిస్థితులకు అనుగుణంగా అత్యాధునిక భవనాల నిర్మాణానికి వివిధ రకాల పరికరాలు, ముఖ్యంగా ఇంటీరియర్ డెకరేషన్ కోసం విదేశాల్లో ఆర్డర్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. అందుకే తాను 10వేల ఎకరాల్లో భవన నిర్మాణ రంగానికి సంబంధించిన అన్నిరకాల మెటీరియల్ ఒకేచోట లభించేలా అత్యద్భుతమైన పార్క్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. భవన నిర్మాణ రంగంతో నిరుద్యోగులకు ఉపాధి, వ్యాట్ రూపేణా ప్రభుత్వానికి ఆదాయం ఉంటుందన్నారు. అభివృద్ధితోబాటే అందరికీ ఆదాయం పెరుగుతుందని, దాంతో గూడు ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనకు వస్తారన్నారు. అందుకే తాను గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. అనేక దేశాల్లో రాజధానులు సముద్ర తీరాల్లో ఉన్నాయని, అయితే ప్రపంచంలోనే తొలిసారి నదీతీరంలో అద్భుత రాజధాని చేపట్టబోతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో రెండు మెగా సిటీలు, నాలుగు కొత్త టౌన్‌షిప్‌లు, 13 స్మార్ట్ నగరాలు ఏర్పాటు లక్ష్యంగా పథకరచన చేశామన్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాలను కెనాల్ సిటీగా, బీచ్- హిల్ రిసార్ట్‌గా, సిటీ ఆఫ్ లేక్‌లుగా అభివృద్ధిపర్చటం జరుగుతుందన్నారు. మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరాలను స్మార్ట్ సిటీలుగా రూపుదిద్దుతామన్నారు. నిర్మాణ రంగంలో రూపురేఖలు, ల్యాండ్‌స్కేప్, ఇంటీరియర్ డెకరేషన్, పటిష్ఠమైన నిర్మాణాలు, సుందర భవన నిర్మాణ శైలి సొంతమయ్యేలా నిరంతర అభ్యాసన, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రాన్ని 2050నాటికి ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దటం మనముందున్న సవాల్‌గా చెప్పుకొచ్చారు. నూతనోత్సాహం, సృజనాత్మకతతో ముందుకెళ్లాలని కోరారు. సమావేశంలో క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ శివారెడ్డి, విజయవాడ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ సుధాకర్, ఆర్‌వి స్వామి, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ బాబు ఎ పాల్గొన్నారు.

చిత్రం... ప్రాపర్టీ షో ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు