రాష్ట్రీయం

మరో ఏడాది వేటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 16: వైసీపీ సభ్యురాలు రోజాను మరో ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని గొల్లపల్లి సూర్యారావు సారథ్యంలోని ప్రివిలేజ్ కమిటీ శాసనసభకు సిఫార్సు చేసింది. ఈ మేరకు గురువారం కమిటీ తన సిఫార్సును స్పీకర్‌కు అందజేసింది. సభ్యురాలు అనిత ఇచ్చిన ఫిర్యాదుమేరకు విచారణ చేపట్టిన కమిటీ ముందు హాజరైన రోజా ఇచ్చిన సమాధానం తమ కమిటీని సంతృప్తి పరచనందున, ఆమెపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించాలని, దానిపై సభదే నిర్ణయాధికారమని స్పష్టం చేసింది. కాగా, ఈ అంశాన్ని సోమవారం నాటి సభలో చర్చించే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, రోజా క్షమాపణ చెబితే వదిలేస్తామని తెదేపా నేతలు పైకి చెబుతున్నా, కీలక నేతలు మాత్రం ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేయాలన్న ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ఇంతటితో వదిలేస్తే సరిపోతుందని, ఇప్పటికే చాలా పబ్లిసిటీ ఇచ్చి ఆమెకు మైలేజీ ఇచ్చామన్న వాదన మెజారిటీ పార్టీ వర్గాల్లో ఉంది.
అటు రోజా కూడా క్షమాపణ విషయంలో పట్టుదలతో ఉండటంతో సస్పెన్షన్ వ్యవహారం ఉత్కంఠగా మారింది. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ముందు సభలో దృశ్యాలకు సంబంధించిన సీడీలను లీక్ చేసిన చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. సభకు చెందిన సీడీలు స్పీకర్ అనుమతి లేకుండా వెళ్లేందుకు వీల్లేదని, ఈ విషయంలో స్పీకర్‌కు సంబంధం లేదనుకుంటే, అఫీషియల్ టెలికాస్ట్ సంస్థ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపైనయినా కేసు పెట్టాలని రోజా గత కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు.